పాడి రైతులకు పశువుల దాన పంపిణీ
పినపాక నియోజకవర్గం ఆగష్టు 17 (జనం సాక్షి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మున్సిపాలిటీ పరిధిలో అన్నారం గ్రామల్లో బుధవారం పశువుల పెంపకం దారులకు కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు ప్రభుత్వ విప్ పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి పశు దాన పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం పశుసంవర్ధక శాఖ వైద్యాధికారి ప్రతాప్ ఆధ్వర్యంలో ఒక్కొక్కరికి ఐదు కిలోల చొప్పున అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. జిల్లా కలెక్టర్ నిధుల నుంచి మంజూరైన పశు దానను మణుగూరు మున్సిపాలిటీ పరిధిలో ఉన్న పశువుల పెంపకం దారులకు ఒక్కొక్కరికి ఐదు కిలోల చొప్పున పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.పశు దాన కావలసిన పాడి రైతులు సమీపంలో ఉన్న పశు వైద్యాధికారులను సంప్రదించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డి పి ఆర్ ఓ, జడ్పిటిసి పోశo నరసింహారావు,తహసిల్దార్ నాగరాజు మణుగూరు మున్సిపాలిటీ కమిషనర్ మాధవి, మున్సిపాలిటీ సిబ్బంది పశు వైద్యులు, స్థానిక రైతులు పాల్గొన్నారు.