పాత పెంక్షన్ విధానం పునరుద్ధరించాలి ఉపాధ్యాయులు

బిచ్కుంద జులై 19 (జనంసాక్షి) కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గ పరిధిలోని
బిచ్కుంద మండలంలో బుధవారం నాడు సంకల్ప రథయాత్ర పోస్టర్ ఆవిక్షరణ జరిగింది. ఈ సందర్భంగా ప్రధాన కార్యదర్శి అహ్మద్ మాట్లాడుతు వెంటనే రాష్ట్ర ప్రభుత్వం సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ ను పునరుద్ధరించాలని డిమాండ్ చేయడం జరిగింది. కామారెడ్డిలో ఈ నెల 25 న జరిగే రథయాత్రలో ప్రతీ ఉద్యోగ ఉపాద్యాయులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు కుంట్ల ఎల్లారెడ్డి, జిల్లా బాధ్యుడు విట్టల్, యాదవ్, లింగం, మోహన్, మండల అధ్యక్షుడు మహేందర్ రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి షేఖ్ అహ్మద్, వివిద సంఘాల నాయకులు, ఇర్షాద్ అలీ, సీమ శ్రీనివాస్, కిశోర్ మరియు ఉపాద్యాయులు తదితరులు పాల్గోన్నారు.

తాజావార్తలు