పార్టీ బలోపేతానికి కృషి చేయాలి
వికారాబాద్ జిల్లా బిజెపి అధ్యక్షుడు సదానంద రెడ్డి
దోమ అక్టోబరు 18(జనం సాక్షి)
రాబోయే ఎన్నికల వరకు పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని వికారాబాద్ జిల్లా బిజెపి అధ్యక్షుడు సదానంద రెడ్డి అన్నారు. మంగళవారం మండల కేంద్రంలో మండల అధ్యక్షుడు శేరి రాంరెడ్డి అధ్యక్షతన బీజేపీ ముఖ్య నాయకులు, పదాధికారులతో ముఖ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సదానంద రెడ్డి మాట్లాడుతూ మిగిలిన బూత్ కమిటీలను త్వరగా పూర్తిచేయాలని, రాబోయే ఎలక్షన్లలో పరిగి గడ్డపైన ఎగిరేది బిజెపి జెండానే అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా కార్యదర్శి దోమ మండల్ మోత్కూర్ సర్పంచి కేశవులు జిల్లా నాయకులు శంకర్ బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రావు దోమ బీజేపీ ప్రధాన కార్యదర్శిలు మాలేషం విజయి కుమార్ బీజేవైఎం మండల అధ్యక్షుడు మేకల నర్సింలు జిల్లా నాయకులు బాలరాజ్ కిసాన్ మోర్చా అధ్యక్షులు వాళ్ల భాస్కర్ బీజేపీ కార్యదర్శులు పాండయ్య కేశవులు సాలే నర్సింలు బీరప్ప బీజేవైఎం ప్రధాన కార్యదర్శి మహేష్ కుమార్ కార్యకర్తలు పాల్గొన్నారు
Attachments area