పెదప్రజలకు అండగా సిఎం సహయనిది…

మాదారం గ్రామంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేత.
– వైస్ ఎంపీపీ సత్తి అరుణ్ కుమార్ రెడ్డి.
ఊరుకొండ, సెప్టెంబర్ 1 (జనం సాక్షి):
సీఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కులు నిరుపేదలకు వరాలుగా మారాయని.. అభాగ్యులకు సీఎం సహాయ నిధి అండగా నిలుస్తుందని వైస్ ఎంపీపీ సత్తి అరుణ్ కుమార్ రెడ్డి అన్నారు. గురువారం ఊరుకొండ మండల పరిధిలో మాదారం గ్రామంలో లబ్ధిదారులకు మంజూరైన సీఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కులను అందచేశారు. ఈ సందర్భంగా వైస్ ఎంపీపీ సత్తి అరుణ్ కుమార్ రెడ్డి, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షులు మన్నెం రవీందర్ రెడ్డిలు మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌ పేదలకు వైద్య సేవలు భారం కొవొద్దని రాష్ట్ర ప్రభుత్వం సీఎంఆర్‌ఎఫ్‌ ద్వారా నిధులు అందజేస్తున్నారని పేర్కొన్నారు. గత 8 సంవత్సరాలలో సీఎం రిలీఫ్‌ ఫండ్‌ ద్వారా ఎంతోమంది అభాగ్యులకు కోట్ల రూపాయలను అందజేసిన ఘనత ముఖ్యమంత్రి కెసిఆర్ కే దక్కుతుందని అన్నారు. దరఖాస్తు చేసుకొన్న అందరికి ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయాన్ని అందిస్తున్న ఏకైక నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని అన్నారు. తెలంగాణ ప్రభుత్వ హయాంలో అమలవుతున్న ప్రతి పథకాన్ని అర్హులైన పేదలందరికీ అందిస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వ పథకాలను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి సహకారంతో మాధారం గ్రామానికి చెందిన మాలె శ్రీనివాస్ రెడ్డికి రూ.20,000/-, మరియు మాలె వెంకటమ్మకు రూ.18500/- చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో తెరాస మండల పార్టీ అధ్యక్షులు ద్యాప వీరారెడ్డి గారు. గ్రామ తెరాస అధ్యక్షులు ఇషాక్, ఉప సర్పంచ్ హుస్సేన్ వార్డు మెంబర్లు ధ్యాప ఆల్వాల్ రెడ్డి, లస్కర్ రాజు, మేకల రాములు, ముదివేంటి శ్రీను, గోడుప్పరి నరేష్, ఊర్కొండ పేట ఆలయ ధర్మకర్త పాపిశెట్టి చంద్రమోహన్, కో ఆప్షన్ మెంబర్ చిక్కొండ్ర మల్లేష్, నాయకులు వేముల రాములు, మాజీ సర్పంచ్ నారాయణ రెడ్డి, మల్లారెడ్డి, మేకల చిన్న రాములు, బొల్గం రామచంద్రయ్య, ఇంద్రకంటి మల్లేష్, మాలె రాణి, నాయీ బ్రాహ్మ్మణుల అధ్యక్షులు వీరమళ్ళ నాగేష్, నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.