పోడు భూముల సర్వే ప్రక్రియ ముగియగానే తక్షణమే పట్టాలు అందించాలి
సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు రామచందర్
టేకులపల్లి, అక్టోబర్ 9( జనం సాక్షి ): రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 140 జారీ చేయడంతో ఏడాది క్రితం దరఖాస్తులు సేకరించిన అధికారులు గత రెండు రోజుల నుండి మండలంలోని అన్ని పంచాయితీలో పోడు భూముల పట్టాల కోసం సర్వే ప్రక్రియను చేపట్టడం పట్ల తెలంగాణ గిరిజన సమాఖ్య రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సిపిఐ పార్టీ జిల్లా కౌన్సిల్ సభ్యుడు గూగులోత్ రామచందర్ హర్షం వ్యక్తం చేశారు. పోడు భూముల సాగు చేసుకుంటున్న గిరిజనులకు పట్టాలు ఇచ్చేందుకు సర్వేలు ఫారెస్ట్ అధికారులు గ్రామ పంచాయతీ కార్యదర్శులు ఎట్టకేలకు మండల పరిధిలోని గోలియా తండా గ్రామపంచాయతీ లో సర్వే చేశారు. ఆర్ ఎఫ్ ఆర్ ఓ పట్టాలు సర్వే పూర్తయిన తర్వాత ప్రభుత్వం ఎలాంటి ఆంక్షలు పెట్టకుండా సాగు గిరిజన రైతులకు తక్షణమే పాస్ పట్టా పుస్తకాలను అందజేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.