Wednesday, 4 November 2026

పోలీసుల బారి బందోబస్తు మధ్య చంద్రమౌళి అంత్యక్రియలు పూర్తి

మోత్కూర్ ,అక్టోబర్ 18 జనంసాక్షి : యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలంలోని బుజిలాపురం గ్రామానికి చెందిన పంగ చంద్రమౌళి అనుమానాస్పద స్థితిలో మృతి చెందగా కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన మోత్కూర్ పోలీసులు.. కాగా మృతుని బంధువులు చంద్రమౌళి మృతికి ధర్మపురం గ్రామానికి చెందిన వ్యక్తి కారణమంటూ ఆందోళన చేపట్టారు. సోమవారం రోజు రాత్రి చోటు చేసుకున్న ఉద్రిక్త పరిస్థితుల నడుమ మృతుని బంధువులు చేసిన ఆందోళనలో మోత్కూర్ ఎస్సై జానకి రామ్ రెడ్డి తలకు గాయాలయ్యాయి. దీంతో పోలీసులు లాఠీఛార్జ్ చేసి అందరిని చెదరగొట్టారు. అర్థరాత్రి కావడంతో అంత్యక్రియలు నిర్వహించడం ఇబ్బందులు తలెత్తడంతో మృతదేహాన్ని తిరిగి రామన్నపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. మంగళవారం రోజు భారీ బందోబస్తు తో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చంద్రమౌళి మృతదేహాన్ని బుజిలపురం గ్రామానికి తీసుకువచ్చి దహన సంస్కారాలు నిర్వహించారు. దీంతో మూడు రోజులపాటు జరిగిన ఉద్రిక్తత పరిస్థితులకు, పోలీసులు తెరదింపారు.కాగా పంగ చంద్రమౌళి మరణానికి ధర్మాపురం గ్రామానికి చెందిన యల్లంల రాములమ్మ కారణమని,సోమవారం అర్థరాత్రి పోస్టుమార్టం అనంతరం పంగ చంద్రమౌళి శవాన్ని తీసుకుని వచ్చి యల్లంల రాములమ్మ ఇంటిలో వేసి ఇక్కడే అంత్యక్రియలు చేస్తామని అక్రమ సంఘంగా ఏర్పడిన బుజిలాపురం గ్రామస్తులు రోడ్డుపై ధర్నా నిర్వహించినారు. ఆ తరువాత ట్రాక్టర్లలో కర్రలు మొద్దులు తీసుకుని వచ్చి శవాన్ని ఇంటి వద్దనే తగులపెట్టే ప్రయత్నం చేస్తుండగా, అడ్డుకున్న బందోబస్తు నిర్వహిస్తున్న పోలీసువారిపై బుజిలాపురం గ్రామస్తులు ధాడి చేసి రాళ్ళతో కర్రలతో దాడికి పాల్పడినారు. దాడికి పాల్పడిన వారిలో బుజీలపురాని చెందిన అంబటి బిక్షం, పంజాల మహేందర్, చేతరాసి చెంద్రయ్య లను రిమాండ్ కి పంపించటం జరిగిందని, రెండు కేసులు నమోదు చేసుకుని ధర్యాప్తు చేస్తున్నామని ఎస్సై జానకి రామ్ రెడ్డి తెలిపారు.
Attachments area