పోలీస్ ప్రాథమిక అర్హత పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి

సూర్యాపేట ప్రతినిధి (జనంసాక్షి):పోలీస్ ప్రాథమిక అర్హత పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్ తెలిపారు.పరీక్ష నిర్వహణకు సంబంధిత అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు.జిల్లా పోలీస్ పటిష్టమైన బందోబస్త్ ను ఏర్పాటు చేసిందని తెలిపారు.శనివారం సూర్యాపేట పట్టణ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన ప్రశ్నాపత్రాల స్ట్రాంగ్ రూమ్ యొక్క భద్రతను నోడల్ అధికారి డిఎస్పీ నాగభూషణంతో కలిసి పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సూర్యాపేట, కోదాడ పట్టణాల్లో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు.అన్ని పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని తెలిపారు.పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు హాల్ టికెట్ లపై ఉన్న నియమ నిబంధనలను కచ్చితంగా పాటించాలని సూచించారు.పరీక్షా కేంద్రాలకు సకాలంలో చేరుకోవాలని,ఉదయం 9గంటల నుండి పరీక్ష కేంద్రంలోకి అభ్యర్థులను అనుమతించడం జరుగుతుందని తెలిపారు.