Tuesday, 3 November 2026

ప్యాసింజర్‌ రైలులో దోపిడీ

మంచిర్యాల,మే4(జ‌నంసాక్షి): మంచిర్యాల జిల్లా పరిధిలోని రవీంద్రగని, మందమర్రి రైల్వేస్టేషన్ల మధ్య నాగ్‌పూర్‌ పాసింజర్‌ రైలులో శనివారం వేకువజామున దుండగులు దోపిడీకి పాల్పడ్డారు. సికింద్రాబాద్‌ నుంచి నాగ్‌పూర్‌ వెళుతున్న పాసింజర్‌ రైలు మందమర్రి సవిూపంలోని నీలగిరితోట దగ్గరకు చేరుకోగానే ఆరుగురు దుండగులు రైలు చైను లాగి ఇద్దరు మహిళల నుంచి ఆరు తులాల బంగారం ఎత్తుకెళ్లారు. ఈ విషయంపై బాధితులు జీఆర్పీ పోలీసులకు సమాచారం అందించడంతో వారు స్థానిక పోలీసులను అప్రమత్తం చేశారు. పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ దుండగుల జాడ తెలియలేదు. సంఘటనా స్థలాన్ని జాగిలాలతో తనిఖీ నిర్వహించారు.