Tuesday, 3 November 2026

ప్రగతినివేదన సభ వైపు ప్రజల చూపు

హైదరాబాద్‌,సెప్టెంబర్‌1(జ‌నం సాక్షి ): ఎప్పుడు ఎన్నికలు వచ్చినా టీఆర్‌ఎస్‌ వంద సీట్లు గెలుస్తుందని ఇటీవలే టిఆర్‌ఎస్‌లో చేరిన దానం నాగేందర్‌ అన్నారు. బహిరంగ సభ ఏర్పాట్లను చూసి ప్రతిపక్షాల కడుపు మండుతోందని పేర్కొన్నారు. అరవై ఏళ్ళలో జరగని అభివృద్ధిని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కేవలం నాలుగు సంవత్సరాల్లోనే చేసి దేశంలోనే ఆదర్శంగా నిలిచిందన్నారు. బహిరంగ సభ వలన ప్రజాధనం దుర్వినియోగం అవుతుందని ప్రతిపక్షాల విమర్శల్లో అర్థం లేదన్నారు. గతంలో ప్రజలు ఎప్పుడూ ఏ పార్టీ సభకు ఇంత స్వచ్ఛందంగా తరలి వస్తున్న దాఖలాలు లేవన్నారు. అందుకే ప్రగతి కోరుకుంటున్న తెలంగాణలోని ప్రజానీకం అంతా ప్రగతి నివేదిక సభ జరుగుతున్న కొంగర్‌ కలాన్‌ వైపు చూస్తున్నారని చెప్పారు.