ప్రజల వద్దకు ఆర్టిసి సేవలు…
– డిపో మేనేజర్ శ్రీకాంత్.
ఊరుకొండ, సెప్టెంబర్ 11 (జనం సాక్షి):
ప్రజలందరూ ఆర్టీసీ బస్సులను వినియోగించుకోవాలని, ప్రైవేటు వాహనాలను ఆశ్రయించి ప్రమాదాలు కొని తెచ్చుకోవద్దని.. ప్రజల వద్దకు ఆఫీసు సేవలు వస్తున్నాయని ఆర్టీసీ కల్వకుర్తి డిపో మేనేజర్ శ్రీకాంత్ గ్రామ ప్రజలకు సూచించారు. ఆదివారం ఊరుకొండ మండల పరిధిలోని జగబోయినపల్లి గ్రామంలో ఏర్పాటుచేసిన ప్రజల వద్దకు ఆర్టీసీ సేవలు అవగాహన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డిపో మేనేజర్ మాట్లాడుతూ..
ప్రజల కోసం ఆర్టీసీ సురక్షిత మైన, సుఖవంతమన ప్రయాణాన్ని అందిస్తుందని తెలిపారు ఆర్టీసీ అందిస్తున్న పథకాలు, రాయితీల గురించి వివరించారు. ఆటోలో, ప్రైవేటు వాహనాలలో ప్రయాణించకుండా, ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణించి ఆర్టీసీ అభివృద్ధికి తోడ్పాటును అందించాలని పేర్కొన్నారు. ప్రజలు ఆర్టీసీకి తమ యొక్క సలహాలు, సూచనలు తెలపాలని సూచించారు. కార్యక్రమంలో కార్మిక నేత దార సుందర్, మల్లయ్య, శంకర్, కల్వకుర్తి జేఏసీ సదానందం గౌడ్, గ్రామ ఉప సర్పంచ్ సురేందర్, గ్రామ పెద్దలు సుధాకర్ రెడ్డి, ప్రయాణికులు, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.