ప్రజల వద్దకు ఆర్టీసీ కార్యక్రమం
బోనకల్ , సెప్టెంబర్ 9 ,(జనం సాక్షి):
ప్రజల వద్దకు ఆర్టీసీ కార్యక్రమాన్ని బోనకల్ మండలంలోనీ ఆళ్లపాడు గ్రామంలో శుక్రవారం సర్పంచ్ మర్రి తిరుపతిరావు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా మధిర డిపో మేనేజర్ ఎస్ దేవదానం మాట్లాడుతూ ఆర్టిసి ప్రజలకు,విద్యార్థులకు ప్రయాణాలలో రాయితీలు ద్వారా అనేక ప్రయోజనాలు కల్పిస్తున్మదని ,స్కూల్ విద్యార్థులకు ఫ్రీబస్ పాసులు, ప్రజలకు నెలవారి సీజన్ పాసులు అందిస్తూ ఎన్నో సంవత్సరాల నుండి సేవలు అందిస్తున్నదని, ప్రస్తుతo పెరిగిన ఆయిల్ రేట్లతో ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నదని వ్యయ భారం తగ్గించుకొని సర్వీస్లు పెంచాలంటే ప్రజలు సహకరించాలని పేర్కొన్నారు. ప్రజలు ప్రైవేట్ వాహనాలలో ప్రయాణం చేయడం సురక్షితం కాదని ,ఆర్టీసీ బస్సులో శిక్షణ పొందిన డ్రైవర్లు బస్సులు నడపడం వలన క్షేమంగా గమ్యాస్తానాలు చేరుతారని డిపో మేనేజర్ గుర్తు చేశారు. కలకోట సర్పంచ్ మాట్లాడుతూ ఆర్టీసీ ద్వారా ప్రజలకు సర్వీస్ లు పెంచాలంటే సర్వీస్ చార్టు ఖచ్చితముగా అమలయ్యేలా చూడాలన్నారు.సర్పంచ్ భాగం శ్రీనివాసరావు మాట్లాడుతూ అదనంగా రెండు ట్రిప్పులు మదిర నుండి ఖమ్మం వయ ఆళ్లపాడు మీదగ వేయాలని కొరగా దానికి మేనేజర్ స్పందిస్తూ బోనకల్ లో రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణ పనులు కాగానే ట్రిప్పులు పెంచుతామని అన్నారు .ఈ కార్యక్రమానికి ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ హుస్సేన్, టి సి ఎన్ రేడ్డి,నాగులుమీర,ఆళ్ళపాడు సర్పంచ్ మర్రి తిరుపతిరావు గోవిందపురం ఎ సర్పంచ్ భాగం శ్రీనివాసరావు, కలకోట సర్పంచ్ యంగల దయమణి, అసోసియేట్ ప్రొఫెసర్ ఆమరయ్య , పి ఈ టి మాధవరావు,పారా కోటేశ్వరావు, తోటపల్లి సాల్మన్ గ్రామ పెద్దలు,విద్యార్థులు సామాజిక కార్యకర్త మరీదు బరకయ్య తదితరులు పాల్గొన్నారు.