మేడ్చల్(జనంసాక్షి) : జిల్లా వ్యాప్తంగా ప్రజావాణిలో ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించి వారి సమస్యలు తీర్చేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఈ విషయంలో ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తులు, వినతులను ఏమాత్రం పెండింగ్‌లో ఉంచకుండా త్వరగా పరిష్కరించేలా జిల్లా అధికారులు అవసరమైన చర్యలు తీసుకోవాలని మేడ్చల్ –- మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టర్ శ్యాంసన్ అన్నారు.
సోమవారం శామీర్‌పేటలోని కలెక్టరేట్ ప్రజావాణి హాల్లో జిల్లా రెవెన్యూ అధికారి లింగ్యానాయక్‌తో కలిసి ప్రజల నుంచి వచ్చిన47 వినతులు, ఫిర్యాదులు, విజ్ఞప్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులు ఆయా శాఖల అధికారులు వెంటవెంటనే పరిష్కరించి ప్రజల ఇబ్బందులు తీర్చాల్సిన బాధ్యత ఉందని దీనిని దృష్టిలో పెట్టుకొని సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించాలని అదనపు కలెక్టర్ శ్యాంసన్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆయా శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.




