దళితబంధుకు రూ.17,700 కోట్లు కేటాయింపు
దళితబంధు ద్వారా 11,800 కుటుంబాలకు లబ్ది
హైదరాబాద్,మార్చి7(జనం సాక్షి): దళితబంధు పథకాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.
అనుకున్నట్లుగానే ఇందులో నిధులు కేటాయింపను జరిగింది. కు రూ.17,700 కోట్లు కేటాయిస్తామని ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. తెలంగాణ శాసన సభలో మంత్రి హరీష్ రావు 2022`23 సంవత్సరానికి బడ్జెట్ ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. దళితబంధు ద్వారా 11,800 కుటుంబాలకు లబ్ది చేకూర నుందని, అతిపెద్ద నగదు బదిలీ పథకంగా దళితబంధు చరిత్ర సృష్టించిందన్నారు. బ్యాంకు లింకులు లేకపోవడంతో పాటు నిబంధనలు లేవన్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరం ఏడాది రూ. 75 వేల లోపు సాగు రుణాలు మాఫీ చేస్తామని, రూ. 50 వేల లోపు రైతు రుణాలు మార్చి లోపు మాఫీ చేస్తామని హావిూ ఇచ్చారు. పంట రుణాలు రూ. 16,144 కోట్లు మాఫీ చేశామని, ఈ దఫా 5.12 లక్షల మంది రైతులకు రుణాలు మాఫీ చేశామన్నారు. సొంత స్థలం ఉంటే డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణానికి ఆర్థిక సాయం చేస్తామని, సొంత స్థలాల్లో ఇండ్ల నిర్మాణానికి రూ. 3 లక్షల ఆర్థిక సాయం చేస్తామని, సొంతస్థలం ఉన్న 4 లక్షల మందికి రూ. 3 లక్షల ఆర్థిక సాయం చేస్తామన్నారు. నియోజకవర్గానికి 3 వేల ఇండ్లు కేటాయిస్తామని, ఎమ్మెల్యేల పరిధిలో 3.57 లక్షల ఇండ్లు కేటాయింపు ఉంటుందని వివరించారు. నిర్వాసితులు, ప్రమాద బాధితులకు 43 వేల ఇండ్లు కేటాయిస్తామని, సిఎం పరిధిలో నిర్వాసితులు, ప్రమాద బాధితులకు ఇండ్లు కేటాయిస్తామన్నారు.




