Saturday, 7 November 2026

ప్రతి అభిరుచికి ఒక కొత్తదనం తీయని అనుభూతి కోసం

భావాల ప్రసారమై అనుభూతుల దివ్య భవనంలో
మనసు వీనపై మమతల రాగానే ఆలపిస్తూ
జీవన విలాసంపై నయన మనోహర దృశ్యాన్ని
ఈ నది తీరాలలో ఈ ఇసుకదిన్నెలపై
గవ్వలను ఏరుకుంటూ
గతాన్ని మర్చిపోతూ వర్తమానానికి స్వాగతిస్తూ
భవిష్యత్తుకు జ్ఞానవాహిని ప్రసరింపజేస్తూ
మనిషి ఒక వివేచన
శీలిగా
లోకం మనో అంతరంగాన్ని చదివేస్తూ జీవన వ్యాపకాన్ని ఆహ్వానిస్తూ
కొత్త కొత్త భావాల ప్రకటనకు కాలాన్ని జులిపిస్తూ
కలం సిరాతో కొత్త శాస్త్రాలకు నిక్షిప్త ప్రణాళికగా నిధిని
నిర్మిస్తున్నాను ప్రపంచమంతా సౌఖ్యాల విలువలో సాగాలని
ప్రపంచానికి ఇచ్చే సందేశం మానవతా హృదయాలన్నీ ఏకం కావాలని
డాక్టర్ సిహెచ్ ఆంజనేయులు ఖమ్మం బోనగిరి కొట7702537453