Thursday, 5 November 2026

ప్రధానితో కెసిఆర్‌ లాలూచీ

కాళేశ్వరానికి జాతీయ మోదా ఎందుకు అడగలేదు: రావుల

హైదరాబాద్‌,జూన్‌19(జ‌నం సాక్షి ): ముఖ్యమంత్రి కేసీఆర్‌ కేంద్రంతో లాలూచీ పడుతున్నారని తెదేపా సీనియర్‌ నేత రావుల చంద్రశేఖర్‌ రెడ్డి ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ.20వేల కోట్లు అడుగుతున్న కేసీఆర్‌.. జాతీయ ¬దా ఎందుకు అడగడం లేదని ప్రశ్నించారు. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలు నీళ్లు రాకుండా అడ్డుకుంటుంటే ఎందుకు మాట్లాడడం లేదని నిలదీశారు. నీతి అయోగ్‌ సమావేశంలో తెలంగాణకు రావాల్సిన హక్కులను కాపాడుకోవడంలో సీఎం విఫలమయ్యారని ఆరోపించారు. విభజన చట్టం అమలు పరచడంలో కేంద్రం ఉదాసీనంగా వ్యవహారిస్తోందని ఆక్షేపించారు. రాష్ట్రంలో తెరాస ప్రభుత్వం వచ్చాక మహిళల పరిస్థితి అత్యంత దయనీయంగా మారిందన్నారు. నిజామాబాద్‌ ప్రాంతంలో తెరాస ఎంపీపీ.. మహిళపై దాడి చేస్తే ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. ఈ ఘటనను తెదేపా తీవ్రంగా ఖండిస్తోందని చెప్పారు. మహిళలపై జరిగే దాడిపై తెదేపా పోరాటం చేస్తుందని రావుల స్పష్టం చేశారు.