కొత్తూరు మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులతోనీ ఇటుకలను మోయిస్తున్న విషయం తెలుసుకున్న స్థానిక ఏబీవీపీ నాయకులు పాఠశాలకు వెళ్లి ప్రధానోపాధ్యాయురాలుని ప్రశ్నించగా పొరపాటు జరిగిందని ఇంకెప్పుడూ ఎటువంటి సంఘటనలు జరగకుండా చూసుకుంటామని హామీ ఇచ్చారు . అనంతరం పాఠశాల ఆవరణలో కోరుతున్న అంగన్వాడి విద్యార్థుల దగ్గరికి వెళ్లి పరామర్శించారు కనీసం విద్యార్థులు కూర్చోవడానికి కూడా తరగతులు ఇవ్వడం లేదని అంగన్వాడీ టీచర్లు వాపోయారు ధనిక రాష్ట్రంగా చెప్పుకుంటున్నా తెలంగాణలో భావి భారత పౌరులు చదువుకోడానికి కనీసం తరగతి గదులు లేక పోవడం దురదృష్టకరమని ఏబీవీపీ నాయకులు అన్నారు సంబంధిత ఉన్నతాధికారులు వెంటనే స్పందించి తరగతి గదులను మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.




