రాష్ట్ర యువజన కాంగ్రెస్ పార్టీ నాయకులు చిలుక మధుర ఉపేందర్
విద్యార్థులకు నోటు బుక్స్, పెన్సిల్స్ పంపిణీ
ఎల్బీనగర్( జనం సాక్షి ) ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు చేయూత నిచ్చేందుకు ఎల్లప్పుడు ముందుంటామని రాష్ట్ర యువజన కాంగ్రెస్ పార్టీ నాయకులు చిలుక మధుర ఉపేందర్ రెడ్డి అన్నారు . మహేశ్వరం నియోజకవర్గం ఆర్కే పురం డివిజన్ పరిధిలోని ఎన్టీఆర్ నగర్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులకు నోటు బుక్స్, పెన్సిల్స్ పంపిణీ చేసిన రాష్ట్ర యువజన కాంగ్రెస్ పార్టీ నాయకులు *చిలుక మధుర ఉపేందర్ రెడ్డి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మా రామకృష్ణ పురం డివిజన్ పరిధిలోని చదువుకుంటున్న విద్యార్థులకు నోటు బుక్స్, పెన్సిల్స్ అందించడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. అలాగే రాబోయే రోజుల్లో కూడా విద్యార్థులకు ఏ అవసరం ఉన్న మా వంతు సహాయ సహకారాలు అందజేస్తామన్నారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు మనిపాల్ రెడ్డి, శేషమ్మ, కవిత, నిఖత్ , కాంగ్రెస్ పార్టీ నాయకులు అల్లేటి కిరణ్ కుమార్, ప్రేమ్ నాయక్, అక్బర్, కళ్యాణ్, జహంగీర్, మామిడి రామకృష్ణ గౌడ్, వంగాల శ్రీకాంత్ రెడ్డి, పెద్దవూర సైదులు, విప్లవ్, సిరిశి, పురుషోత్తం* తదితరులు పాల్గొన్నారు.
Attachments area




