*కలెక్టర్ కి విజ్ఞప్తి చేసిన డా. సత్యం శ్రీరంగం.”
* ఫతే నగర్ డివిజన్ లోని దీనదయల్ నగర్ లో కబ్జాకి గురవుతున్న స్థలాన్ని కాపాడాలని కలెక్టర్ కి వినతి పత్రం సమర్పించిన డా. సత్యం శ్రీరంగం.
కూకట్ పల్లి( జనంసాక్షి ):
కూకట్ పల్లి నియోజక వర్గం ఫతే నగర్ డివిజన్ లోని దీనదయల్ నగర్ లో కబ్జాకి గురవుతున్న స్థలాన్ని కాపాడాలని మేడ్చెల్ మల్కాజ్ గిరి జిల్లా కలెక్టర్ డా. ఎస్. హరీష్ ని కలిసి మంగళవారం నాడు వినతి పత్రం సమర్పించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు టీపీసీసీ అధికార ప్రతినిధి డా. సత్యం శ్రీరంగం, ఈ సందర్బంగా సత్యం శ్రీరంగం మాట్లాడుతూ హైదరాబాద్ నగరంలో కూకట్ పల్లి నియోజక వర్గం అభివృద్ధి చెందుతుందని, ఇందులో అనేక కాలనీల్లో ఉన్న ప్రభుత్వ స్థలాలు కబ్జాలకు గురవుతున్నాయని, దీనదయల్ నగర్ లోని వెయ్యి గజాల స్థలం ప్రభుత్వ అవసరాల కోసం గత 30 సంవత్సరాలుగా కాలిగా ఉన్న స్థలాన్ని కొందరు వ్యక్తులు కబ్జా చేస్తున్నారని దయచేసి ఈ స్థలాన్ని కాపాడమని రేవంత్ రెడ్డి రాసిన లెటర్ ని మేడ్చెల్ మల్కాజ్ గిరి జిల్లా కలెక్టర్ కి అందజేశారని తెలియచేసారు. అదేవిధంగా ఈ ప్రభుత్వ స్థలాన్ని ప్రజా ప్రయోజనాలకు వాడాలని స్థానిక అవసరాలకు తగినట్టుగా మహిళా మండలి భవనం , పార్కుకు , స్కూల్ కి ఏదైనా ప్రభుత్వానికి సంబంధించిన భూమికి వాడే విధంగా వాడాలని ఈ వినతి పత్రంలో కోరారు. పార్లమెంట్ సభ్యులు రేవంత్ రెడ్డి లేఖతో పాటుగా 2009 లో ఈ స్థలానికి సంబంధించిన వివిధ పత్రాలను, పూర్తి వివరాలను కలెక్టర్ కి అందజేయటం జరిగిందని సత్యం శ్రీరంగం తెలియజేసారు. పీసీసీ అధ్యక్షులు మల్కాజ్ గిరి పార్లమెంట్ సభ్యులు రేవంత్ రెడ్డి ఈ కబ్జాకు గురవుతున్న స్థలంపై పూర్తి నివేదిక సమర్పించవలసిందిగా కలెక్టర్ ని కోరినట్టుగా తెలియజేసారు. ఈకార్యక్రమంలో ఏ బ్లాక్ అద్యక్షులు పి. నాగిరెడ్డి, ఫతే నగర్ డివిజన్ అధ్యక్షులు రమేష్ ముదిరాజ్, సూరజ్ తివారి, రాజు ముదిరాజ్, కే. రమేష్ బాబు. తదితరులు పాల్గొన్నారు.




