Wednesday, 4 November 2026

ప్రమాదపు అంచుల్లో మసివాగు వంతెన

బయ్యారం,జులై19(జనంసాక్షి):
బయ్యారం మండలం అల్లిగూడెం గ్రామపంచాయతీ పరిధిలోని మసివాగు వంతెన తీవ్ర ప్రమాదకరంగా మారింది. వంతెనకు రెండు వైపులా రక్షణ స్తంబాలు(సైడ్ పిల్లర్లు) లేకపోవడంతో ఎటువంటి రక్షణ లేకుండా పోయింది.వంతెన చివరల రోడ్డు మీద వెళ్లే వాహన దారులు ఏ మాత్రం ఏమరపాటుగా ఉన్నా పెను ప్రమాదాలు చోటుచేసుకునే ఆస్కారం ఉంది.వంతెన చివరలో సుమారు 10 నుండి 15 అడుగుల లోతు వరకు ఉన్నప్పటికీ ఎటువంటి ప్రమాద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయకపోవడం విచారకరం.ఇటీవలే ఒక రైతు నీటిలో గల్లంతై మరణించిన సంగతి తెలిసిందే.నష్టం జరిగిన తర్వాత నష్టపరిహారం చెల్లించే ఆలోచన కాకుండా ఇలాంటి ప్రమాదాలకు అవకాశం ఉన్న వాటిని గుర్తించి తగు చర్యలు తీసుకుంటే కొంతలో కొంతైనా ప్రమాదాలు తగ్గించే అవకాశం లేకపోలేదు.ఏటా ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నా ప్రమాదాల నిర్ములన దిశగా అడుగులు మాత్రం పడకపోవడం ఆలోచించాల్సిన విషయమే.బయ్యారం మండల కేంద్రం నుండి 20-30 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఏజెన్సీ ప్రాంతంలో ఇప్పటికైనా ఇటువంటి ప్రమాదకరంగా ఉన్న వంతెనలు గుర్తించి వాటిపై సైడ్ పిల్లర్లు నిర్మించి,తగు జాగ్రత్తలు సూచించే సూచికా బోర్డులను సంబంధిత అధికారులు ఏర్పాటు చేస్తారో వేచి చూడాల్సిందే.