Monday, 2 November 2026

ప్రాణం పోతే రానప్పుడు ఉద్యోగం పోతే మళ్ళీ ఎందుకు ఉద్యోగం రావాలి

 

 

 

 

 

 

 

 

ఎల్బీ నగర్ (జనం సాక్షి ) పంజాగుట్ట లోని నిమ్స్ ఆసుపత్రికి వెళ్లి గత నెల ఆగస్టు 25న కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసుకొని ఇన్ఫెక్షన్ గురి అయ్యి, పంజాగుట్ట లోని నిమ్స్ ఆసుపత్రికి వెళ్లి     ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మహిళలను బీఎస్పీ ఎల్బీనగర్ నియోజకవర్గం ప్రజా సంక్షేమ సంఘం అధ్యక్షులు జక్క యాదగిరి  బాధితులను పరామర్శించారు.  మహిళల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారని, వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, మిగతా నలుగురు మహిళలు చనిపోవడమే చాలా బాధాకరమని అన్నారు. మహిళల ప్రాణాలు పోయినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వారి ప్రాణాలను తిరిగి ఏమైనా తీసుకురాగలుగుతుందా? అలాంటప్పుడు నిర్లక్ష్యంగా ఆపరేషన్ చేసి, నలుగురు మహిళల మృతికి కారణమైన వైద్యులను తాత్కాలికంగా తొలగించడం కాదు, శాశ్వతంగా వైద్య వృత్తి నుండి తొలగించాలని, వారి జీవితంలో మళ్లీ ఎప్పుడు ఇంకెవరికి వైద్య చికిత్స చేసే అవకాశం ఇయ్యొద్దని, ఆ వైద్యులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని జక్క యాదగిరి డిమాండ్ చేశారు   . అదేవిధంగా వైద్య ఆరోగ్యశాఖ మంత్రి టి. హరీష్ రావు  ఈ ఘటనకు నైతికంగా బాధ్యత వహిస్తూ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ప్రాణం కన్నా పదమేమి గొప్పదేమీ కాదని అన్నారు. పోర్చుగల్ దేశంలో ఒక భారతీయ గర్భిణికి సరైన సమయంలో చికిత్స అందక ప్రాణాలు కోల్పోయిందని, ఆ ఘటనకు ఆ దేశ ఆరోగ్య శాఖ మంత్రి, మార్టా టేమిడో తన  మంత్రి పదవికి రాజీనామా చేశారని, పోర్చుగల్ లో దేశ ఆరోగ్యశాఖ మంత్రి రాజీనామా చేసినప్పుడు, ఇక్కడ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రాజీనామ చేస్తే పోయేదేమీ లేదని మాట్లాడారు. మంత్రి పదవి నుండి రాజీనామా చేస్తే ఇలాంటి సంఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా ఉంటాయని. కొత్తగా వచ్చిన మంత్రులు బాధ్యతతో భయంతో పనిచేస్తారని అన్నారు. చనిపోయిన మహిళలకు కుటుంబానికి 50 లక్షలు ఇవ్వాలని, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రతి కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నిమ్స్ ఆస్పత్రి సందర్శించిన వారిలో సతీష్, స్వప్న యాదవ్, అనిల్ యాదవ్ తదితరులు ఉన్నారు.