*’ప్రిన్స్ బావర్చి ఫ్యామిలీ రెస్టారెంట్ ను ప్రారంభించిన కోదాడ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ హుజూర్నగర్ ఎమ్మెల్యే సైదిరెడ్డి*
కోదాడ సెప్టెంబర్ 25(జనం సాక్షి):
నాణ్యమైన ఆహార పదార్థాల అమ్మకాలతో వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవాలని కోదాడ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ హుజూర్నగర్ శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డిలు అన్నారు. ఆదివారం కోదాడ మండలం రాంపురం ఎక్స్ రోడ్డు వద్ద ప్రిన్స్ బావర్చి ఫ్యామిలీ రెస్టారెంట్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాణ్యత పాటిస్తూ వినియోగదారులకి మంచి సేవలు అందించాల న్నారు. పెట్టుబడిదారులు నూతన వ్యాపార నెలకొల్పి నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నారు. నగరాలకు దీటుగా వ్యాపార రంగంలో అభివృద్ధి చెందాలన్నారు. వినుత పద్ధతుల్లో వ్యాపార సంస్థలు ఏర్పాటు కావడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలను వ్యాపార సంస్థ యజమానులు అభినందించారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు అల్తాఫ్ హుస్సేన్,స్థానిక టిఆర్ఎస్ నాయకులు, నాయకులు, సర్పంచులు, ఎంపిటిసిలు,తదితరులు పాల్గొన్నారు.