హైదరాబాద్,మార్చి7(జనం సాక్షి): రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెడుతున్న సందర్భంగా ఫిల్మ్ నగర్ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆర్థిక మంత్రి హరీశ్ రావు ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు మంత్రిని ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. హరీశ్‌రావుతో పాటు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అక్కడ్నుంచి నేరుగా హరీశ్‌రావు అసెంబ్లీకి బయల్దేరారు. కోకాపేట్‌లోని తన నివాసం వద్ద హరీశ్‌రావు విూడియాతో మాట్లాడారు. సీఎం కేసీఆర్ ఆశీస్సులతో మూడోసారి బడ్జెట్ ప్రవేశపెడుతున్నానని హరీశ్‌రావు తెలిపారు. ప్రజల ఆకాంక్షలు ప్రతిబింబించేలా బ్జడెట్ ఉంటుంది. ప్రజలకు ఇచ్చిన హావిూలు నెరవేరేలా బడ్జెట్ ఉంటుందని మంత్రి స్పష్టం చేశారు. ఉదయం 11:30 గంటలకు శాసన సభలో తాను, మండలిలో మంత్రి ప్రశాంత్ రెడ్డి బడ్జెట్ ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. ప్రజలకు ఇచ్చిన హావిూలకు అనుగుణంగా ఈ బ్జడెట్ ఉంటుందన్నారు. మానవీయ కోణంలో ఈ బ్జడెట్‌ను రూపొందించామని చెప్పారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా బడ్జెట్ ఉండబోతుందని మంత్రి హరీష్ రావు
పేర్కొన్నారు.




