Tuesday, 3 November 2026

ఫీజు రియంబర్స్‌మెంటులో అలసత్వం తగదు

హైదరాబాద్‌,సెప్టెంబర్‌2(జ‌నం సాక్షి): ఫీజు రీయంబర్స్‌మెంట్‌ విడుదలలో ప్రభుత్వ జాప్యాన్ని విద్యార్తి సంఘాలు తీవ్రంగా తప్పుపట్టాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి నాలుగున్నరేళ్లు గడిచినా విద్యావ్యవస్థలో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదని ఆయా సంఘాల నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. డిగ్రీ, పీజీ విద్యార్థులకు ఇప్పటికీ ఫీజురీయంబర్స్‌మెంట్‌ను విడుదల చేయకపోవడంతో అనేక ఇబ్బందులకు గురవతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే ఫీజు రీయంబర్స్‌మెంట్‌ను విడుదల చేయాలని డిమాండు చేశారు. ప్రభుత్వ, ఎయిడెడ్‌ విద్యాసంస్థలను నడపకపోగా, వివిధ కారణాలను చూపి మూసివేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేజీ టు పీజీ విద్యలో శాస్త్రీయత లేదని విమర్శించారు.