Wednesday, 4 November 2026

బంగారు తెలంగాణే ద్యేయం

మంత్రి మల్లారెడ్డి :శామీర్ పేట్, జనం సాక్షి : బంగారు తెలంగాణే లక్ష్యంగా సీఎం కేసీఆర్ అహర్నిశలు పాటుపడుతున్నారని మంత్రి మల్లారెడ్డి అన్నారు. శుక్రవారం
శామీర్పేట్ మండలం అలియాబాద్ శుభం గార్డెన్ లో ఎంపీపీ ఎల్లుభాయి, ఎంసి పల్లి లో ఎంపీపీ హారిక, తుంకుంట మొగుళ్ళ రామకృష్ణ రెడ్డి ఫంక్షన్ హలులో చైర్మన్ రాజేశ్వర్ రావ్ ఆధ్వర్యంలో నూతన ఆసరా ఫించన్ కార్డు కార్యక్రమానికి మంత్రి మల్లారెడ్డి విచ్చేసి ప్రారంభించారు.శామీర్పేట్ మండలంకు మంజూరు అయినా 57 ఏళ్ళు వారికీ నూతనంగా ఆసరా పెన్షన్, మరియు దివ్యంగా పెన్షన్ , గీతా కార్మికులకు మంజూరు అయినా 950మంది లబ్ధిదారులకు ఆసరా పెన్షన్ కార్డుల పంపిణి కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులకు అందజేశారు .
ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ శరత్ చంద్ర రెడ్డి, తుంకుంట చైర్మన్ రాజేశ్వర్ రావ్,ఎంపీపీ ఎల్లుబాయ్,జడ్పీ వైస్ చైర్మన్ వెంకటేష్,జడ్పీటీసీ అనిత, డీసీఎంస్ వైస్ చైర్మన్ మధుకర్ రెడ్డి, ఎంపిడిఓ వాణి,కౌన్సిల్లర్లు ఎంపీటీసీలు, సర్పంచులు, కో అప్షన్ సభ్యులు, అధికారులు, నాయకులు, మండల తెరాస పార్టీ అధ్యక్షులు సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.
2ఎస్పీటీ,-2: ఫించన్ కార్డులు అందజేస్తున్న మంత్రి