*బతుకమ్మ చీరలను పంపిణీ చేసిన కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్*

మెట్పల్లి టౌన్, సెప్టెంబర్ 27:
జనం సాక్షి
జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని వెంకటరెడ్డి గార్డెన్స్ లో బతుకమ్మ పండుగ కానుకగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న బతుకమ్మ చీరలను కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు పంపిణీ చేశారు. మెట్పల్లి పట్టణ మరియు పరిసర గ్రామాల ఆడపడుచులకు బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ అని అన్నారు పేద ధనిక అనే బేధం లేకుండా అందరూ కలసి ఆడుతూ పాడుతూ సంతోషంగా జరుపుకునే వేడుక బతుకమ్మ అని, తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా రాష్ట్ర పండుగ గుర్తించిందని ఈ సందర్భంగా ప్రత్యేకంగా బతుకమ్మ కానుకగా ఆడపడుచులకు చీరలు పంపిణీ చేశారు అని అన్నారు. పలు సంక్షేమ పథకాలు అందిస్తున్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమైనని అన్నారు. ఈ కార్యక్రమం ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ రాణవేణి సుజాత సత్యనారాయణ, మున్సిపల్ కమిషనర్ సల్వాది సమ్మయ్య ,మున్సిపల్ వైస్ చర్మన్ బోయినపల్లి చంద్రశేఖర రావు, ప్రజా ప్రతినిధులు ,నాయకులు మహిళా ఆడపడుచులు, పాల్గొన్నారు