బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాల్సిందే:జిల్లా కాంగ్రెస్ నాయకులు

*బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాల్సిందే:జిల్లా కాంగ్రెస్ నాయకులు*
బయ్యారం,సెప్టెంబర్30(జనంసాక్షి):
తెలంగాణ రాష్ట్ర విభజన చట్టంలో పొందుపరిచిన విధంగా బయ్యారంలో ఉక్కు పరిశ్రమను కాలయాపన చేయకుండా  ఏర్పాటు చేయాల్సిందేనని మహబూబాబాద్ డీసీసీ అధ్యక్షులు జన్నారెడ్డి భరత్ చంద్రా రెడ్డి, నియోజకవర్గ నాయకులు డాక్టర్ భూక్యా రాంచంద్ర నాయక్ డిమాండ్ చేశారు.శుక్రవారం బయ్యారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ… ఉమ్మడి  విభజన చట్టంలో  పొందుపరిచినట్లు  బయ్యారం లో ఉక్కు పరిశ్రమను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయకపోతే రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగల్బాలు పలకడం జరిగిందని తెలిపారు.తెలంగాణ రాష్ట్రం నుంచి తెలంగాణ ప్రజల ఓట్లతో గెలిచి కేంద్రమంత్రి అయిన కిషన్ రెడ్డి బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు సాధ్యం కాదని చెప్పడం ఏమిటని ప్రశ్నించారు.నీళ్లు,నిధులు, నియామకాల కోసమే తెలంగాణ రాష్టం ఏర్పడితే నియోజకవర్గఅభివృద్ధి పేరుతో తన స్వార్ధ ప్రయోజనాల కొరకు అధికార టిఆర్ఎస్ పార్టీలో చేరారని, నియోజకవర్గ అభివృద్ధి ఏమో కాని ఎమ్మెల్యే మాత్రం ఆర్ధికంగా ఎంతో బలోపేతం అయ్యారని ఆరోపించారు. కేవలం బయ్యారం  లో ఉక్కుపరిశ్రమ  అధికార పార్టీ రాబోయే ఎన్నికలలో  లబ్ది కోసమే  వాడుకుంటున్నారని, ఎమ్మెల్యే కు చిత్తశుద్ధి ఉంటే వెంటనే రాజీనామా చేసి ఉక్కు పరిశ్రమ కొరకు నిరాహారదీక్ష చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా బయ్యారం ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని సూచించారు.బయ్యారం ఉక్కు తెలంగాణ హక్కు అని గుర్తు చేశారు.ఉక్కు పరిశ్రమ సాధన కొరకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అలుపెరుగని పోరాటాలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.ఈసమావేశంలో బయ్యారం మండల అధ్యక్షులు కంబాల ముసలయ్య,బయ్యారం పట్టణ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి,యంపిటిసి భూక్యా లక్ష్మీ,మహిళ కాంగ్రెస్ నాయకురాలు నిర్మల రెడ్డి,మండల ప్రధాన కార్యదర్శి  గట్ల గణేష్,సొసైటీ డైరెక్టర్ కేతామల్లు ,వర్కింగ్ ప్రెసిడెంట్ గోకినేని సీతారామయ్య ,దామోదర్ రెడ్డి,గౌరిశెట్టి వెంకన్న,గుగులోత్ రామ్ కోటి,తిరుమల సుధాకర్ రెడ్డి,నిరంజన్,బండి యాదగిరి గౌడ్,కేసా నిరంజన్. లాకావత్ మహేష్,బాను నాయక్.పలువురు నాయకులు పాల్గొన్నారు.