Wednesday, 4 November 2026

బల్క్ డ్రగ్ పార్క్ కేటాయింపులో తెలంగాణకి మోడీ సర్కార్ మొండి చేయి- కెటిఆర్

తెలంగాణ పై వివక్షతో దేశ ప్రయోజనాలను తాకట్టు పెడుతున్న కేంద్ర ప్రభుత్వం

• బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటుకు అంతర్జాతీయ ప్రమాణాలతో నెలకొల్పుతున్న హైదరాబాద్ ఫార్మాసిటీ అత్యంత అనుకూలం

• భూసేకరణ, పర్యావరణ అనుమతులు, మాస్టర్ ప్లానింగ్ తో  సిద్ధంగా ఉన్న ఫార్మా సిటీని కావాలనే కేంద్రం విస్మరించింది.

• మారుతున్న ప్రపంచ రాజకీయాల నేపథ్యంలో బల్క్ డ్రగ్ పార్క్ ల ఏర్పాటు అత్యవసరమన్న కేంద్రం మరో నాలుగేళ్లులయినా పట్టలెక్కని ప్రాంతాలకు వాటి కేటాయించింది

• కొత్తగా బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు చేయాలంటే కనీసం గా మూడేళ్లు పడుతుందన్న కేటీఆర్

• అన్ని సిద్దంగా ఉన్న హైదరాబాద్ ఫార్మాసిటీని పరిగణలోకి తీసుకుపోకపోవడం, ఫార్మా రంగాన్ని అత్మనిర్భరత దిశగా స్వయం సమృద్ధి చేయాలన్న లక్ష్యం పట్ల కేంద్రానికి ఉన్న నిబద్ధతలేమికి నిదర్శనం

• అన్ని అనుకూలతలు,అనుమతులతో సిద్ధంగా ఉన్న హైదరాబాద్ ఫార్మసిటీకి మొండి చేయి ముమ్మాటికీ వివక్షే

• వెంటనే తెలంగాణకు బల్క్ డ్రగ్  పార్క్ కేటాయించాలని కేటీఆర్ డిమాండ్

 

తెలంగాణ పట్ల కేంద్ర సర్కార్ వివక్షపూరిత వైఖరి కొనసాగుతూనే ఉందని ఐటీశాఖమంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.తారకరామారావు ఆరోపించారు. తాజాగా కేంద్ర ప్రభుత్వం  ప్రకటించిన బల్క్ డ్రగ్ పార్క్ పథకంలో తెలంగాణకు చోటు దక్కకపోవడమే ఇందుకు సాక్ష్యం అన్నారు. లైఫ్ సైన్సెస్- ఫార్మా రంగాల్లో అంతర్జాతీయ స్థాయిలో దూసుకుపోతున్న దేశ లైఫ్ సైన్సెస్ రాజధాని, వ్యాక్సిన్ క్యాపిటల్ ఆఫ్ వరల్డ్ హైదరాబాద్ నగరాన్ని కావాలనే విస్మరించిందని అసంతృప్తి వ్యక్తం చేశారు. బల్క్ డ్రగ్ పరిశ్రమ ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాలను ఎంపిక చేయడం మోడీ సర్కార్ వివక్షాపూరిత రాజకీయాలకు పరాకాష్ట అన్నారు కేటీఆర్. అంతర్జాతీయ ప్రమాణాలతో రాష్ట్ర ప్రభుత్వం నెలకొల్పుతున్న హైదరాబాద్ ఫార్మసిటీ పేరును కనీసం పరిశీలించకుండా తెలంగాణ పట్ల తనకున్న వివక్షను కేంద్ర సర్కార్ బయటపెట్టుకుందని కేటీఆర్ విమర్శించారు. బల్క్ డ్రగ్ పార్కుల కేటాయింపులో తెలంగాణకు జరిగిన తీవ్ర అన్యాయాన్ని ఎత్తిచూపుతూ కేంద్ర కెమికల్, ఫెర్టిలైజర్ శాఖ మంత్రి మన్న్సుక్ మాండవియాకి కేటీఆర్ లేఖ రాశారు.

 

70 శాతం పైగా ముడిసరుకుల కోసం మన దేశ ఫార్మా రంగం చైనా పై ఆధారపడుతోందన్న కేటీఆర్, మారుతున్న ప్రపంచ రాజకీయాల దృష్ట్యా బల్క్ డ్రగ్ తయారీలో దేశీయ ఫార్మా రంగం స్వయం సమృద్ధి సాధించాలన్న లక్ష్యంతో 2015 లో 2000 ఏకరాల్లో వివిధ రాయితీలు, ప్రోత్సహకాలతో బల్క్ డ్రగ్ పార్క్ లను ఏర్పాటు చేసే పథకాన్ని కేంద్రం తెరపైకి తీసుకువచ్చిందని చెప్పారు. అయితే అపరిమిత అలస్యం తరువాత, కోవిడ్ సంక్షోభం నేపథ్యంలో పార్కు ఎర్పాటు అవసరం పట్ల కళ్లు తెరిచిన కేంద్రం 2020లో అధికారిక ప్రకటన చేసిందన్నారు. అతర్వతా సైతం ప్రతిపాదనలు స్వీకరించి వాటిపైన నిర్ణయం తీసుకునేందుకు మరో రెండు సంవత్సరాలు అలస్యం చేసిందన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా, నేటి వరకు ఎన్నో సార్లు బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు కోసం కేంద్రాన్ని కోరుతూనే ఉన్నామన్నారు. బల్క్ డ్రగ్ పార్క్ ను తెలంగాణకు కేటాయించాలని కేంద్ర ఫార్మాసూటికల్ శాఖకు రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రతిపాదనలను కూడా  సమర్పించామని చెప్పారు. హైదరాబాద్ ఫార్మసిటీ లోని 2000 ఎకరాల్లో ఈ బల్క్ డ్రగ్ పార్క్ ని ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు కేంద్రానికి స్పష్టంగా తెలియచేశామన్నారు. ఫార్మాసిటీ మాస్టర్ ప్లాన్ ను కూడా అందచేశామన్నారు. కీలకమైన భూసేకరణ, పర్యావరణ అనుమతులతో పాటు ఫార్మాసిటీకి ఉన్న సానుకూల అంశాలను వివరిస్తూ కేంద్రానికి సమగ్రమైన నివేదిక ఇచ్చామని తెలిపారు. దీంతోపాటు ఢిల్లీ వెళ్లిన ప్రతీసారి కేంద్ర మంత్రులను కలిసి విజ్ఞప్తి చేసిన విషయాన్ని కేటీఆర్ ఈ సందర్భంగా గుర్తు చేశారు.

 

బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు చేయాలని 2015లో నిర్ణయం తీసుకున్న నరేంద్ర మోడీ సర్కార్, ప్రతిపాదనల పరిశీలన, ఇతర అంశాల పేరుతో  2021 వరకు టైంపాస్ చేసిందని కేటీఆర్ ఆరోపించారు. తాజాగా ప్రకటించిన జాబితాలో అన్ని సిద్దంగా ఉన్న తెలంగాణకు చోటు దక్కకపోవడం తమను షాక్ గురించేసిందని కెటియార్ అన్నారు. కొత్తగా బల్క్ డ్రగ్ పార్క్ ను ఏర్పాటు చేయాలంటే భూసేకరణ, ప్లానింగ్, డిజైన్,  పర్యావరణ, ఇతర అనుమతులు తీసుకోవడానికే  కనీసంగా మూడు సంవత్సరాల సమయం పడుతుందని కేటీఆర్ చెప్పారు. చైనాతో ప్రస్తుతం ఉన్న ఉద్రిక్తతల దృష్ట్యా సాధ్యమైనంత త్వరగా దేశీయ ఫార్మా రంగం స్వయం సమృద్ధిని సాధించాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. దేశ ఫార్మా …