బస్టాండ్ లో కనీస వసతులు కరువు
ముస్తాబాద్ అక్టోబర్ 10 జనం సాక్షి
ముస్తాబాద్ మండల కేంద్రం కొత్త బస్టాండ్ లో కనీస వత్తులు కరువు సమస్యలు కేరాఫ్ అడ్రస్ గా మారింది అధికారుల నిర్లక్ష్యం వల్ల బస్టాండ్ లో సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి వసతులు లేక ప్రయాణికులు నానా అవస్థలు పడుతున్నారు కనీసం తాగడానికి మంచినీరు కూడా లేదు మరుగుదొడ్లు ముత్రశాలలో నెలలు, గడిచిన నిర్మాణం మాత్రమే కొనసాగుతున్నాయి, వివిధ గ్రామాల నుండి మండలనికీ వస్తుంటారు రాకపోకలు సాగుతూ ఉంటారు మహిళకు మూత్రశాలలు లేక నానా అవస్థలు పడుతూ ఇబ్బందులు గురవుతున్నారు బస్టాండ్ పరిశుభ్రత లేక అనారోగ్యానికి గురవుతున్న ప్రయాణికులు వెంటనే తొందరగా మరుగుదొడ్ల పనులు పూర్తి చేయాలని మండల ప్రజలు కోరుతున్నారు