అదరపు ఎస్పి చంద్రయ్య.
రాజన్న సిరిసిల్ల బ్యూరో. ఆగస్టు 22 (జనం సాక్షి) బాధితులకు సత్వరం న్యాయం అందించేందుకు ప్రజాదివస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని అదనపు ఎస్పి చంద్రయ్య అన్నారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో బాధితుల నుండి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సివిల్ సమస్యలను కోర్టు పరిధిలో పరిష్కరించుకోవాలి సూచించారు. బాధితులకు సత్వర న్యాయం అందించాలని ఉద్దేశంతోనే ప్రజాదివాస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని వచ్చిన ఫిర్యాదులపై సంబంధిత ఎస్ హెచ్ ఓ లతో మాట్లాడి సమస్య పరిష్కారం అయ్యేలా చూస్తామని అన్నారు. ప్రజా దివస్ లో 8 ఫిర్యాదులు వచ్చినట్లు కార్యాలయ వర్గాలు తెలిపాయి.




