బాధిత కుటుంబానికి సీఎంఆర్ఎఫ్ చెక్కు అందజేత

 

దౌల్తాబాద్ జూలై 26, జనం సాక్షి.

దుబ్బాక ఎమ్మెల్యే మాధవనేని రఘునందన్ రావు ఆదేశాల మేరకు దౌల్తాబాద్ మండల్ హైమద్ నగర్ గ్రామానికి చెందిన పఠాన్ నన్ని ఖాన్ కు బీజేపీ మండల అధ్యక్షులు పోతరాజు కిషన్ 80,000/- రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్కును అందజేశారు.ఈ సందర్బంగా మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలకు చెందిన రోగులు కార్పొరేట్ హాస్పిటల్ లో వైద్యం చేయించుకుంటే దానికి సంబంధించిన బిల్లులు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అందజేస్తే ఎమ్మెల్యే చొరువుతో బాధితులు లబ్ధి పొందే అవకాశం ఉంటుందని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు భూపాల్ రెడ్డి, అనిల్ రెడ్డి, బీజేపీ కార్యకర్తలు జావీద్, తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు