*గోపాల్ పేట్ జనం సాక్షి అక్టోబర్(02):*
గోపాలపేట మండల పరిధిలోని బుద్ధారం గ్రామంలోని పాటిగడ్డ తండాకు చెందిన ముడావత్ భాస్కర్ నాయక్ తన తండ్రి హన్మ్య నాయక్ అనారోగ్యంతో నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకున్న టిఆర్ఎస్వి రాష్ట్ర నాయకులు శ్రావణ్ కుమార్ మంత్రి నిరంజన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్ళగా మంత్రి వెంటనే స్పందించి 2.5 లక్షల ఎల్ ఓ సి చెక్కును మంజూరు చేయించి ఆదివారం హైద్రాబాద్ లోని మినిస్టర్ క్వార్టర్స్ లో ఆ చెక్కును హన్మ్య నాయక్ కుమారుడు భాస్కర్ నాయక్ కు అందజేశారు.తన తండ్రిని ఆపదలో ఆదుకున్న వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి కి భాస్కర్ నాయక్ ధన్యవాధాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో శశివర్దన్ రెడ్డి,డీసీఎంయస్ వైస్ చైర్మన్ హర్యా నాయక్,తిరుపతి,భాస్కర్ తదితరులు పాల్గొన్నారు
Attachments area




