బాధిత కుటుంబాలకు అన్ని విధాలుగా అండగా ఉంటాం
-వెంకటాపురం సర్పంచ్ శీలం లింగన్న గౌడ్
తొర్రూరు 21 సెప్టెంబర్( జనంసాక్షి )
బాధిత కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటామని వెంకటాపురం సర్పంచ్ శీలం లింగన్న గౌడ్ అన్నారు. వెంకటాపురం గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన వంగ రామయ్య (80) కుటుంబానికి పరామర్శించి కుంటుంబ సభ్యులకు 50 కేజీల బియ్యాన్ని అందచేశారు, ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆశీస్సులతో గ్రామ ప్రజలకు అన్ని విధాలుగా అండగా ఉంటానన్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా నిత్యం ప్రజల మధ్యలో ఉండి వారి కష్టసుఖాల్లో పాలుపంచుకుంటానన్నారు.ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ గ్రామ పార్టీ నాయకులు పోరెడ్డి వీరారెడ్డి, భాస్కర్, ఉప్పల్ రెడ్డి, వెంకన్న, రామన్న,వార్డు సభ్యులు రామ్మూర్తి, శ్రీనివాస్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.
—
Sent from Email.Avn for mobile
Attachments area