బింబిసారతో కళ్యాణ్‌రామ్‌కు బ్రేక్‌

ఏడేళ్ళ కిందట వచ్చిన ’పటాస్‌’ చిత్రం కళ్యాణ్‌ రామ్‌ కెరీర్‌లోనే బిª`గగెస్ట్‌ హిట్‌. కమర్షియల్‌గా ఈ చిత్రం కళ్యాణ్‌రామ్‌ మార్కెట్‌ను పెంచింది. ఇక ఈ చిత్రం తర్వాత ఇప్పటివరకు ఆ స్థాయిలో మరో హిట్‌ పడలేదు. మధ్యలో ’118’ చిత్రం ప్రేక్షకుల మెప్పు పొందినా, కమర్షియల్‌గా సక్సెస్‌ కాలేకపోయింది. దాంతో కళ్యాణ్‌రామ్‌ ఏడేళ్ళుగా కమర్షియల్‌ హిట్‌ కోసం ఎదురు చూస్తున్నాడు. ఈ క్రమంలో అత్యంత భారీ బడ్జెట్‌తో ’బింబిసారా’ చిత్రాన్ని తనే స్వయంగా నటించి నిర్మించాడు. శుక్రవారం విడుదలైన ఈ చిత్రం పాజీటీవ్‌ రివ్యూలను తెచ్చుకుని ఘన విజయం సాధించింది. మల్లిడి వశిష్ఠ దర్శకుడిగా పరిచయమవుతూ తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ దగ్గర భారీ వసూళ్ళను సాధిస్తుంది. అంతేకాకుండా కళ్యాణ్‌ కెరీర్‌లోనే అత్యధిక ఓపెనింగ్స్‌ను రాబట్టిన సినిమాగా బింబిసారా నిలిచింది