బిజెపి ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవం.
బెల్లంపల్లి టౌన్, సెప్టెంబర్17,(జనంసాక్షి)
భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవం శనివారం ఘనంగా జరుపుకున్నారు. బెల్లంపల్లి నియోజక వర్గ బిజెపి ఇన్చార్జ్ కొయ్యల ఏమాజీ ఆధ్వర్యంలో లంబాడి తండాలో జాతీయ జెండాను ఎగరవేశారు. అనంతరం బెల్లంపల్లి పట్టణంలోని శిశుమందిర్ కాంట్రాక్ట్ బస్తిలో జెండా ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ఏమాజీ మాట్లాడుతూ బిజెపి పోరాటాల వల్లనే రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ దిగి వచ్చి తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలు నిర్వహిస్తున్నారని తెలిపారు. గత 9 సంవత్సరాలుగా తెలంగాణ ఏర్పడినప్పటి నుండి విమోచన దినోత్సవం జరపాలని ఎన్ని పోరాటాలు చేసినా పట్టించుకోని కేసీఆర్ నిజాం రజాకారులకు, ఎంఐఎం నాయకులకు వంత పాడుతూ విమోచన దినోత్సవం జరపలేదని అన్నారు. కానీ ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో విమోచన దినోత్సవం అధికారికంగా నిర్వహిస్తామని నరేంద్ర మోడీ, అమిత్ షా ప్రకటించడంతో దిక్కు లేక కేసీఆర్ దిగివచ్చి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని తెలిపారు. కేవలం హిందూ ప్రజల ఓటు బ్యాంకు కోసం ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో లంబడితండ గ్రామ సర్పంచ్ గుర్రాల రాయమల్లు, అజ్మీరా శ్రీనివాస్, జిల్లా కార్యదర్శి గోవర్ధన్, దూది ప్రకాష్, పొన్నకాయల నాగరాజు, శనిగారపు శ్రావణ, నవీన్, నర్సింగ్, సాయికుమార్, కళ్యాణ్ కుమార్, సుభాష్, కార్తీక్, గంగ రామన్న, రంగ మల్లేష్ తదితరులు పాల్గొన్నారు