బిల్లులు సకాలంలో చెల్లించాలి

సెప్టెంబర్ 27, సారంగాపూర్, జనం సాక్షి…, మండలం లోని బీరవెల్లి గ్రామంలో టీఎస్ ఎన్పీడీసీఎల్ డైరెక్టర్ గణపతి మంగళవారం రోజు పర్యటించారు. గ్రామంలోని విద్యుత్ సబ్ స్టేషన్ను సందర్శించి విద్యుత్ లైన్లను పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యుత్ చౌర్యానికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కొంతమంది రైతులు అవగాహన రాహిత్యంతో పంట చేల కు రక్షణ కోసం విద్యుత్ కంచెలను వేస్తున్నారని విద్యుత్ కంచె తగిలి ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారని అక్రమంగా విద్యుత్ కంచెలను వేసే వారిపై కేసులు నమోదు చేయనున్నట్లు ఆయన తెలిపారు వినియోగదారులు సకాలంలో బిల్లులు చెల్లించాలని వ్యవసాయ బోర్లకు కెపాసిటర్ లను ఏర్పాటు చేసుకోవాలని ఆయన సూచించారు ఈ కార్యక్రమంలో ఆయన వెంట నిర్మల్ విద్యుత్ ఎస్ఈ జయవంత్ చౌహన్ డిఈ మధుసూదన్ ఏడిఈ రంగస్వామి ఏఈ రాజేందర్ మరియు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు