Monday, 2 November 2026

బీహార్ ముఖ్యమంత్ర నితీష్ కుమార్ సీఎం కేసీఆర్ ను ఉద్దేశించి మాట్లాడుతూ “ మీ గురించి అవగాహన లేని వారే మీ గురించి తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు.

 

31 (జనంసాక్షి) తెలంగాణ

ఈ సందర్భంగా బీహార్ ముఖ్యమంత్ర నితీష్ కుమార్ సీఎం కేసీఆర్ ను ఉద్దేశించి మాట్లాడుతూ “ మీ గురించి అవగాహన లేని వారే మీ గురించి తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు. మీరు వారి విమర్శలను పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఆత్మస్థైర్యం కోల్పోకుండా పట్టుదలతో ముందుకు కొనసాగండి. మీ భాగస్వామ్యం చాలా గొప్పది. మీ ద్వారా తెలంగాణ అనే ఒక రాష్ట్రమే ఏర్పడింది. ఈ దేశంలో ఈ రకంగా పోరాటాలు చేసి రాష్ట్రాన్ని సాధించిన చరిత్ర మరెక్కడా లేదు. అలా ఒక రాష్ట్రాన్ని సాధించిన వారు మీరు ఒకే ఒక్కరు. మీరు ఒక రాష్ట్రాన్ని సాధించిన మహా నేత. అలాంటి మీ మీద ఎవరెవరో ఏదేదో మాట్లాడుతుంటారు. వాళ్ళ విమర్శలన్నీ ఫాల్తు మాటలు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన మిమ్మల్ని తెలంగాణ ప్రజలు ఎలా వదులుకుంటారు. వదులుకునే ప్రసక్తే ఉండదు. మీరు పట్టువదలకుండా మరింత శక్తి కూడగట్టుకొని మీ రాష్ట్రాభివృద్ధిని కొనసాగించండి”