బూరుగుపల్లి గౌడ సంఘానికి యువ నాయకులు పెంచాల మహేష్ 5000 వేల ఆర్థిక సాయం అందజేత

బోయిన్ పల్లి జులై 24 (జనం సాక్షి) రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్ పల్లి మండలంలోని బూరుగుపల్లి గౌడ సంఘానికి యువ నాయకులు పెంచాల మహేష్ ఆధ్వర్యంలో 5000 రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. ఇటీవల కాలంలో భారీ వర్షాలు పడడం వల్ల రేణుక దేవి ఎల్లమ్మ ఆలయం వైపు తాటివనం వైపు వెళ్లే రోడ్డు పూర్తిస్థాయిలో ధ్వంసమైంది గౌడ సంఘం సభ్యులు ఇబ్బందులు పడుతున్న దృష్ట్యా రోడ్డు వేయడానికి కొంత నగదు మొత్తాన్ని అందజేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా బూరుగుపల్లి గౌడ సంఘం నాయకులు పెంచాల మహేష్ ను అభినందించారు .ఈ కార్యక్రమంలో గౌడ సంఘం నాయకులు పులి చంద్రయ్య ,అతికం అంజయ్య ,గాజర్ల శ్రీనివాస్, పులి ప్రసాద్, ముద్దం మల్లేశం, పులి శ్రీనివాస్, గాజర్ల అశోక్, మహేష్ చంద్రయ్య, కిరణ్, గంగాధర్ ,శంకరయ్య ,సూదుల రవి ,నలిమేల నాగేష్, కొలుపుల మల్లేశం తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు