బేబీ సుమన్ కు ఘన నివాళులు.

మల్కాజిగిరి.జనంసాక్షి.ఆగస్టు8
వాజ్ పేయి నగర్ లో నివాసముంటున్న 10 సంవత్సరాల బేబీ సుమన్ హై ఫీవర్ తో బాధపడుతూ మృతి చెందింది. డాక్యుమెంట్ రైటర్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి చేకొండ నరేష్ బాబు ఆధ్వర్యంలో సంతాప సభను ఏర్పాటు చేశారు.ఈకార్యక్రమానికి వినాయక నగర్ డివిజన్ కార్పొరేటర్ రాజ్యలక్ష్మి, మల్కాజిగిరి సబ్ రిజిస్టర్ పలని కుమారి, మల్కాజిగిరి కార్పొరేటర్ శ్రావణ్ కుమార్, డాక్యుమెంట్ రైటర్లు,స్థానికులు పెద్ద ఎత్తున పాల్గొని బేబీ సుమన్ చిత్రపటానికి పూలమాలలు వేసి కొవ్వొత్తులు వెలిగించి నివాళులర్పించారు.తల్లిదండ్రులు భవాని,అర్జున్ యాదవ్ మరియు కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చి అండగా ఉంటామని భరోసా కల్పించారు. ఈకార్యక్రమంలో శేఖర్ యాదవ్,ఓం ప్రకాష్,సాయి,కృష్ణ ప్రసాద్,కిరణ్, డాక్యుమెంట్ రైటర్ అధ్యక్షులు లక్ష్మణ్, నజీర్,ఉడుత నవీన్,మురళి,సుధీర్ యాదవ్,సంతోష్ యాదవ్,హరీష్, ప్రణయ్,కుమారి,మనోహర్,జనార్ధన్, కృష్ణ,సంతోష్,యూసుఫ్,జ్యోతి,రూప తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు