బోధన్ డిపోను తనిఖీ చేసిన ఆర్ఎం ఉషాదేవి

ఫోటో రైటప్, 17 బీడీఎన్, మాట్లాడుతున్న ఆర్ఎం
బోధన్, ఆగస్టు 17 ( జనంసాక్షి ) : బోధన్ ఆర్టీసీ డిపోను బుధవారం ఆర్టీసీ రీజనల్ మేనేజర్ ఉషాదేవి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా డిపో మేనేజర్ ఉద్యోగస్తులతో గేట్ మీటింగ్ నిర్వహించగా ఆర్ఎం ఉషాదేవి మాట్లాడుతూ,  డిపో ముందటి కన్న ఆర్థికంగా లాభల్లో ఉందని, డిపో యొక్క స్థితిగతులను, డిపో యొక్క ఆర్థిక స్థితి గురించి వివరించారు. డిపో స్వల్ప నష్టాన్ని అధిగమించాలని, ఆక్సిడెంట్ నీ ఎలా నివారించాలో వివరించడం జరిగింది. ఉద్యోగులకు ఇంకా ఆదాయం సంపాదించి డిపోను పూర్తి లాభాల పట్టించాలని, డ్రైవర్ లకు ఫిట్ బస్ ఇవ్వాలని గ్యారేజ్ ఉద్యోగులతో సూచించారు. ఈ సందర్భంలో డీఎం టీఎన్ స్వామి మాట్లాడుతూ,  డిపోను ఇంకా లాభాల్లోకి తెస్తాం అని అందరం టీమ్ వర్క్ చేసి కష్ట పడతామని అర్ఎం కు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ అధికారులు పాల్గొన్నారు.