Thursday, 5 November 2026

భక్తిశ్రద్ధలతో ఈదమ్మ, పోచమ్మ తల్లికి ముక్కులు చెల్లించిన భక్తులు

జనం సాక్షి, వంగూర్:
మండల పరిధిలోని ఉప్పలపహాడ్ గ్రామంలో బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ బోనాల పండుగ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. అదే క్రమంలో గ్రామ ప్రజలందరూ కలిసి ఈదమ్మ, పోచమ్మ ఆలయాలకు డప్పులతో అమ్మవారికి సమర్పించిన నైవేద్యాలతో బోనం తలపై పెట్టుకుని ఆడపడుచులు అమ్మవారు ఆలయానికి తరలివచ్చారు. మహిళలు అమ్మవారికి వస్త్రాలను మొక్కుగా చెల్లించి బోనo ను నైవేద్యం సమర్పించారు. చక్కగా వర్షాలు పడి, మంచి పంటలు పండాలని అమ్మవారిని కోరుకుంటూ దానికి తోడు చలిగాలులు, వర్షాల వల్ల అంటు వ్యాధులు ప్రబలకుండా అనారోగ్యాల నుంచి తమను కాపాడమంటూ అమ్మవారిని ప్రసన్నం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ చిమ్ముల పద్మమ్మ, ఉప సర్పంచ్ రామస్వామి, ఎంపీటీసీ సుగుణమ్మ, తెరాస గ్రామ ప్రెసిడెంట్ గణేష్ యాదవ్, వార్డ్ మెంబర్స్ గ్రామ పెద్దలు పాల్గొన్నారు.