శామీర్ పేట్, జనం సాక్షి :తుంకుంట మున్సిపాలిటీ పరిధిలోని గాయత్రి మహా క్షేత్రంలో శ్రీ రాఘవేంద్ర స్వామి 351 వ ఆరాధన ఉత్సవాలు స్వామివారి బృందా వనంలో కనుల పండుగగా శుక్రవారం నిర్వహించారు. గాయత్రి మహా క్షేత్రం ఆలయ వ్యవస్థాపకులు వాగ్బ్రహ్మ శిష్య పరిరాజక డాక్టర్ ఎస్. వి. ఎల్. ఎన్. మూర్తి ఆధ్వర్యంలో మూడు రోజులపాటు రాఘవేంద్ర స్వామి ఆరాధన ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా శ్రీ రాఘవేంద్ర స్వామి పూర్వారాధన, నిర్మల్య విసర్జన, ఫల పంచామృతాభిషేకం, పాదపూజ, కనకాభిషేకం తులసి అర్చన, హస్తోదకం, తీర్థ ప్రసాదాల వితరణ సాయంత్రం స్వామివారి పల్లకి సేవ, రథోత్సవం, అష్టావధాన సేవ, మంగళహారతి కార్యక్రమాలు భక్తుల కోలాహలం మధ్య ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా భక్తుల సౌకర్యార్థమై అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ పూజ వేడుకల్లో తూముకుంట షామీర్పేట మూడు చింతలపల్లి హైదరాబాద్ మహానగరంలోని పలు ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు.
12ఎస్పీటీ -1: పూజలు నిర్వహిస్తున్న వ్యవస్థాప కులు
భక్తిశ్రద్ధలతో రాఘవేంద్ర స్వామి 351 వ ఆరాధన ఉత్సవాలు




