ఈ సందర్భంగా, ప్రకృతి విపత్తుతో జలమయమై, ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరిని సీఎం పరిశీలించారు. నదికి ఇరువైపులా నీటిలో చిక్కుకున్న గ్రామాల్లో వరదల పరిస్థితిని స్వయంగా పరిశీలిస్తూ, సీఎం ఏటూరునాగారం చేరుకున్నారు.అక్కడి
ఐటీడీఏ గెస్ట్ హౌజ్ లో లంచ్ చేస్తున్నారు. అనంతరం, కరకట్ట వద్ద ఏర్పాటు చేసిన ముంపు బాధితుల పునరావాస కేంద్రానికి వెళ్లి, ముంపు బాధితులను సీఎం పరామర్శిస్తారు. అక్కడే, అధికారులు ఏర్పాటు చేసిన మారుమూల ప్రాంతాల్లో వరదల పరిస్థితిని ఫొటో ఎగ్జిబిషన్లో ముఖ్యమంత్రి పరిశీలిస్తారు.




