బుధవారం 9`3`2022
ఐదురాష్టాల్ర ఎన్నికల ఫలితాలపై దేశం యావత్తూ ఎదురు చూస్తోంది. ఎంతో ఉత్సాహంగా ఆసక్తిగా నేడు వెల్లడయ్యే ఫలితాల కోసం చూస్తున్నారు. ఇవి కేవలం ఐదు రాష్టాల్ర ఎన్నికల ఫలితాలు గానే ప్రజలు చూడడం లేదు. ఈ ఫలితాల మాటున బిజెపి భవితవ్యం ఆధారపడి ఉంది. ఆలాగే ప్రత్యామ్నాయ రాకీయాలకు అడుగు పడుతుందా అన్నది కూడా ఆధారపడి ఉంది. ఇప్పటికే తెలంగాణ సిఎం కెసిఆర్ గుణాత్మక రాజకీయాలు అంటూ బయలు దేరారు. ఆయనకు మమతా బెనర్జీ, ఉద్ధవ్ థాక్రే, స్టాలిన్ లాంటి నేతలు మద్దతు పలికారు. పికె లాంటి వారు వ్యూహాలు పన్నుతున్నారు. పలితాలు బిజెపికి వ్యతిరేకంగా వస్తే ..రాష్ట్రపతి ఎన్నికతో మొదలు పెట్టి మోడీని ఢీకొనాలని చూస్తున్నారు. మోడీని నిలువరించేందుకు ప్రతిపక్షాలను ఐక్యం చేయాలని చూస్తున్నాయి. అందుకే ఈ ఫలితాలకు ప్రాధాన్యం ఏర్పడిరది. దాదాపు ఏడు విడతలుగా జరిగిన ఐదు రాష్టాల్ర ఎన్నికల పోలింగ్ సోమవారం అంటే 7వ తేదీన ముగిసింది. గురువారం అంటే 10వ తేదీన కౌంటింగ్ జరిగి ఫలితాలు వెలువడనున్నాయి. ప్రధానంగా ఉత్తరప్రదేశ్ ఎన్నికలపై అంతా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఇదే సమయంలో కాంగ్రెస్, ఎస్పీల భవితవ్యం ఎలా ఉండబోతున్నదో కూడా తెలియనుంది. యూపిలో ప్రియాంక ప్రభావం ఎలా ఉండబోతున్నదనేది కూడా ఆసక్తిగా మారింది. యూపిలో కాంగ్రెస్ ప్రభావంతో ప్రియాంక రాజకీయ భవిష్యత్ కూడా ఆధారపడి ఉంది.
పంజాబ్‌లో కాంగ్రెస్ అధికారం నిలబెట్టుకుంటుందా లేదా అన్నది కూడా ఆసక్తిగా మారింది. అంతేగాకుండా ఢల్లీికి పరిమితం అయిన ఆప్ పంజాబ్‌లో పాగా వేయబోతోందన్న సర్వేలు ఆసక్తి కలిగిస్తున్నాయి. అలాగే రానున్న రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి ఈ ఫలితాలు కీలకం కాబోతున్నాయి. మోడీ సర్కార్ ఆధ్వర్యం లో డబుల్ ఇంజిన్ ప్రభుత్వాల పనితీరుకు కూడా ప్రజల తీర్పు ఎలా ఉండడబోతోందన్న ఆసక్తి నెలకొంది. ఇన్ని రకాల ప్రశ్నలకు ఈ ఫలితాలు సమాధానం చెప్పబోతున్నాయి. ఉత్తరాఖండ్,గోవా,మణిపూర్, ఉత్తరప్రదేశ్‌లో ప్రస్తుతం బిజెపి ప్రభుత్వాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ఆయా రాష్టాల్ల్రో బిజెపి అధికారం నిలబెట్టుకుంటుందా అన్న ఆసక్తి నెలకొంది. ఉత్తరప్రదేశ్‌లో యోగి పాలనకన్నా మోడీ ప్రభావం ఎలా ఉంటుందన్న ఆసక్తి కూడా నెలకొంది. అయితే ఇప్పటికే వివిధ సంస్థలు ఎగ్జిట్ పోల్స్ వెల్లడిరచాయి. యూపిలో సీట్లు కోల్పోయినా బిజెపి అధికారం దక్కించుకుంటుందని సర్వేలు అన్నీ వెల్లడిరచాయి. ఇదే క్రమంలో అక్కడ ఎస్పీ బాగాపుంజుకుంటుందన్న వార్తలు కూడా వస్తున్నాయి. 2017 అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే 2022 అసెంబ్లీ ఎన్నికలలో సమాజ్ వాది పార్టీ సంఖ్యాబలం పెద్ద ఎత్తున పెరుగుతుందని సర్వేల అంచనాలు చెబుతు న్నాయి. ఆ పార్టీ 47 సీట్లనుంచి 150 సీట్ల వరకు పెంచుకునే అవకాశాలున్నాయని వివిధ విూడియా సంస్థలు నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ వెల్లడిరచాయి. భారతీయ జనతా పార్టీకి గతంతో పోలిస్తే కొన్ని సీట్లు తగ్గుతాయని, అయినా అధికారం నిలుపుకుంటుందని చెప్పాయి. మిగతా పార్టీలు నామమాత్రంగానే సీట్లు సాధిస్తాయని, అవి 20 నుంచి 30 సీట్ల వరకే సాధింవచ్చుననిఅంచనా వేశాయి. నిజానికి ఎగ్జిట్‌పోల్స్‌కూ, అంతకు ముందు ఇవే విూడియా సంస్థలు ప్రకటించిన ఓపీనియన్ పోల్స్, సర్వేల కూ పెద్ద తేడా లేదు. ఎగ్జిట్‌పోల్స్ ప్రకటించిన అంకెలు అభిప్రాయాలే కాని నిజమైన ఫలితాలకు సూచికలు కాకపోవచ్చని గతంలో పలుమార్లు రుజువుయ్యింది. 2017లో ఇవే విూడియా సంస్థలు బిజెపి అధికారం చేరువలోకి రాదని, సమాజ్‌వాది పార్టీ, కాంగ్రెస్ పార్టీలకు 150 కంటే ఎక్కువ సీట్లే వస్తాయని తేల్చాయి. కానీ బిజెపి 312 సీట్లు, ఎస్‌పి,కాంగ్రెస్ 54 సీట్లు సాధించడంతో అంతా తలకిందులయ్యాయి. తమిళనాడులో గతంలో జయలలిత విషయంలోనూ ఎగగ్జిట్ పోల్స్ తలకిందులయ్యాయి. 2017 ఎగ్జిట్ పోల్స్ విఫలమయి
నందువల్ల ప్రస్తుత ఎగ్జిట్‌పోల్స్ విఫలమవుతాయని లేదదా సఫలం అవుతాయని చెప్పడానికి వీలులేదు. నిజానికి ఉత్తరప్రదేశ్ª`లో వివిధ కులాలు సమాహారం. అక్కడ కుల ప్రభావం ఎక్కువ. వివిధ కులాలు సంఘటితమయితే బిజెపి గెలుపు కష్టమని ఎస్పీ,కాంగ్రెస్ పార్టీలు ఆశగా ఉన్నాయి. బిఎస్పీ కూడా ఓట్లు చీల్చుకుంటే తమకే లాభమని ఈ రెండు పార్టీలు అంచనావేస్తున్నాయి. కులాలు చీలిపోయి, ఆయా కులాల కు చెందిన వివిధ రాజకీయ పార్టీలు పోటీ చేస్తే ఓట్లు చీలిపోయి విజయం సాధించే ఫార్ములాను ఉత్తరప్రదేశ్ లో బిజెపి అనుసరించింది. బిఎస్‌పి దాదాపు పోటీలో లేదని, బిజెపి, బిఎస్‌పిల నుంచి యాదవేతర ఓబీసీలు, జాతవేతర దళితుల నేతలు సమాజ్‌వాది పార్టీకి వలస వెళ్లారని ప్రచారం సాగింది. ఈ పరిణామాలే కాక సాగు చట్టాలపై జరిగిన ఉద్యమాలు, అధిక ధరలు, పెట్రో ధరలు, గ్యాస్ ధరలు, నిరుద్యోగం వంటి సమస్యలు, అయిదేళ్ల బిజెపి పాలనపై వ్యతిరేకత చూపుతున్నాయి. ఇక్కడ సిఎం యోగీ కన్నా మోడీపైనే వ్యతిరేకత ఎక్కువగా ఉంది. అందుకే బిజెపి గెలుపు అంత సులువు కాదన్న అంచనాలో కాంగ్రెస్,ఎస్పీలు ఉన్నాయి. ఇంత జరిగినా అఖిలేశ్ యాదవ్ భారీ మెజారిటీతో గెలిచే దిశగా యూపీ ఎన్నికలు సాగలేదని అంతా ఒప్పుకుంటున్నారు. బిజెపికి పూర్తిగా అనుకూలంగా ఉన్న అగ్రవర్ణాల ఓట్లు యదాతథంగా ఆ పార్టీకే పడడం, యాదవేతర ఓబీసీలు కొందరు ఎస్‌పి వైపు మొగ్గి చూపినా అఖిలేశ్ నాయకత్వం పట్ల పూర్తిస్థాయి భరోసా దక్కలేదని తెలుస్తోంది. కేవలం హిందూత్వ భావోద్వేగాల వల్లే నిలదొక్కుకోలేమని బిజెపి గ్రహించి మిగతా కులాల వారిని కూడా అక్కున చేర్చుకుంది. తొలుత కాంగ్రెస్ ఓటు బ్యాంకును తర్వాత ప్రాంతీయ పార్టీల ఓటు బ్యాంకును బిజెపి మెల్లగా తనవైపు తిప్పుకుంది. దీనికి తోడు యూపిలో యోగి ఆదిత్యనాథ్ పాలనా విదానాలపై ప్రజల్లో బాగా భరోసా పెరిగింది. అందుకే ఇక్కడ ఫలితాలపై బిజెపి ఆశగా ఉంది. గోవాలో కాంగ్రెస్‌తో పోటీ పడక తప్పదని అంటున్నారు. ఉత్తరాఖండ్‌లో అదే పరిస్థితి ఉంది. ఇక పంజాబ్‌లో బిజెపికి పెద్దగా ఆశలు లేవు. మొత్తంగా ఈ ఫలితాల ఆధారంగా రాష్ట్రపతి ఎన్నికల్లో ఏ పక్షం వారు విజయం సాధిస్తారన్నది తేలనుంది. అంతేగాకుండా రానున్న సార్వత్రిక ఎన్నికలపైనా ఫలితం చూపనుంది. అందుకే ఈ ఫలితాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ ఫలితాల ప్రభావం ఎలా ఉంటుందో అన్న ఉత్కంఠకు నేడు తెరపడనుంది. పలు రాజకీయ సవిూకరణాలకు ఈ ఫళితాలు ఆధారం కానున్నాయి.




