ఎల్బీ నగర్ (జనం సాక్షి ), ఆర్కే పురం డివిజన్ పరిధిలో క్షిపణి రంగంలో భారతదేశ ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన గొప్ప శాస్త్రవేత్త, రాష్ట్రపతిగా దేశానికి మహూన్నతమైన సేవలందించిన భారతరత్న అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా యూత్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ వేడుకలకు రాష్ట్ర యువజన కాంగ్రెస్ పార్టీ నాయకులు చిలుక ఉపేందర్ రెడ్డి హాజరై ఆ మహనీయుని చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నమస్సుమాంజలు అర్పించారు.
ఈ కార్యక్రమంలో బొడ్డుపల్లి మహేందర్, వంగాల శ్రీకాంత్, కళ్యాణ్, రాజు నాయక్, పగడాల శ్రీశైలం, శ్రీధర్, చిలక రాజు సాయి జగదీష్, ప్రేమ్ నాయక్, సలీం, కిట్టు, భాస్కర్, నగేష్, సుమన్, జహంగీర్, విప్లవ్* తదితరులు పాల్గొన్నారు.




