ఖైరతాబాద్: అక్టోబర్ 21 (జనం సాక్షి) ఉక్రెయిన్‌లో వైద్య విద్యనభ్యసిస్తూ అనివార్య కారణాల వల్ల ఇండియాకు తిరిగి వచ్చిన విద్యార్థులకు తగిన విద్యావకాశాలను తమ యూనివర్శిటీలలో అందించే ఏర్పాట్లు చేశామని భారతదేశంలో ఉబ్జెకిస్తాన్ రాయబారి ప్రకటించారు. భారత ప్రభుత్వ నేషనల్ మెడికల్ కమిషన్ మార్గదర్శకాలకు అనుగుణంగా తమ యూనివర్శిటీలలో 2 వేల సీట్లను భర్తీ చేసేందుకు తగిన ఏర్పాట్లు చేశామన్నారు. ఇటీవల న్యూఢిల్లీలోని బుఖారా స్టేట్ మెడికల్ ఇనిస్టిట్యూట్ (బీఎస్‌ఎంఐ) నుంచి ప్రతినిధులు, భారతదేశంలో విద్యార్ధుల రిక్రూట్‌మెంట్‌కు సంబంధించి ప్రత్యేక భాగస్వామి పీపుల్‌హైవ్ ఎల్‌ఎల్‌సీను కలిసే అవకాశం లభించింది. పీపుల్‌హైవ్ ఎల్‌ఎల్‌సీ కు చెందిన అడ్వొకేట్ ప్రమోద్ జోషి మాట్లాడుతూ బీఎస్‌ఎంఐ కోసం ఒన్ కన్సల్టింగ్, పీపుల్‌హైవ్ ఎల్‌ఎల్‌సీ తదితర సంస్ధల నడుమ ట్యూషన్ ఫీజు వైరుధ్యాలను గురించి వెల్లడించారు. ఉక్రెయిన్ విద్యార్థులకు ప్రత్యేకంగా 3500 డాలర్ల ఫీజు ఉంటుందన్నారు. దరఖాస్తు ప్రక్రియ గురించి డాక్టర్ కుర్బోనోవా మాట్లాడుతూ దీనికోసం ఉబ్జెకిస్తాన్ మెడికల్ హయ్యర్ ఎడ్యుకేషన్ నిబంధనలు స్పష్టంగా ఉన్నాయన్నారు. విద్యార్ధులు తప్పనిసరిగా తమ అకడమిక్ ట్రాన్స్‌స్ర్కిప్ట్/ఎలక్ట్రా




