అల్వాల్ (జనంసాక్షి) సెప్టెంబర్ 18
దేశాన్ని సమైక్యంగా ఉంచడానికి ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర పేరిట కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేస్తున్నారని ఈ యాత్ర ద్వారా బిజెపి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతామని మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్కాజిగిరి అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి నందికంటి శ్రీధర్ అన్నారు. భారత్ జోడో యాత్రకు మద్దతుగా నంది కంటి శ్రీధర్ ఆధ్వర్యంలో అల్వాల్ సర్కిల్ వెంకటాపురం డివిజన్ ఖానాజిగూడ ఇంద్ర గాంధీ విగ్రహం నుంచి మచ్చ బొల్లారం డివిజన్ మహాత్మా గాంధీ విగ్రహం వరకు చేరుకుంది. ఇందిరా గాంధీ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించి యాత్రను ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా నందికంటి శ్రీధర్ మాట్లాడుతూ బిజెపి తీరును ఎండగట్టి ప్రజలను చైతన్యం చేసేందుకు రాహుల్ గాంధీ ఐదు నెలల పాటు దేశంలో3570 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేయనున్నారని తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన ఏ హామీని బిజెపి ప్రభుత్వం అమలు చేయలేదని. దేశం తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి నెట్టవేయబడిందని పేర్కొన్నారు. దేశంలోని రాష్ట్రంలోని ప్రతిపక్షాలను ప్రశ్నించకుండా వివిధ కేసులను గురిచేసి ప్రశ్నించే గొంతులను నొక్కడం ప్రజాస్వామ్య బద్దం కాదని రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరడం ఖాయమని ఆయన ధమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అల్వాల్ సర్కిల్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నిమ్మ అశోక్ రెడ్డి, కృష్ణ గౌడ్, సి ఎల్ యాదగిరి, కంటెస్టెంట్ కార్పొరేటర్ టీఎస్ సంజీవ్ కుమార్, శ్రీనివాస్, సూర్య ప్రకాష్ రెడ్డి, పవన్, చాకో పాండు, సంతోష్ రెడ్డి, శంకర్, మార్షల్, మహిళా నాయకురాలు వీనస్ మేరీ, పద్మ, ఆషారాణి, విమల దేవి,నిర్మల, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు.




