భారత్ రాష్ట్ర సమితి పార్టీ నాయకత్వంలోని దేశ ప్రజలకు న్యాయం జరుగుతుంది
మోమిన్ పేట అక్టోబర్ (జనం సాక్షి)
టిఆర్ఎస్ స్థానంలో నూతనంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో భారత్ రాష్ట్ర సమితి పార్టీతో యావత్ దేశ ప్రజలకు మెరుగైన పాల నతో పాటు తెలంగాణ లో ఉన్నటువంటి ప్రజా సంక్షేమ పథకాలు దేశ ప్రజలందరూ లబ్ధి పొందాలని ఉద్దేశంతో స్థాపించిన బి ఆర్ ఎస్ భారతదేశంలో సంచలనం సృష్టించిన మామిన్ పేట మండల బీసీ సెల్ అధ్యక్షుడు యు రమేష్ సీనియర్ నాయకులు ప్రతాపరెడ్డి లు పేర్కొన్నారు గురువారం మండల పరిధిలోని వెల్జాల్ గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశం వారు మాట్లాడుతూ టిఆర్ఎస్ పార్టీ బి ఆర్ ఎస్ పార్టీగా అవతరించి సందర్భంగా వారు మాట్లాడుతూ దేశ ప్రజలందరూ సుఖ సంతోషాలతో తెలంగాణలో లబ్ధి పొందుతున్న ప్రజా సంక్షేమ పథకాలు దేశమంతా విస్తరించాలంటే కెసిఆర్ ప్రధానమంత్రి నీ చేయడమే దేశ ప్రజల లక్ష్యంగా పని చేస్తున్నారు అన్నారు బిజెపి కాంగ్రెస్ రాష్ట్రాల్లో ఏ మాత్రం అభివృద్ధి చెందకుండా ఉన్నాయని కేసీఆర్ నాయకత్వంలో భారత రాష్ట్ర సమితి దేశంలో కొత్త చరిత్ర సృష్టించబోతుందని వారు జోస్యం చెప్పారు ఈ కార్యక్రమంలో ఎస్సీ సెల్ అధ్యక్షులు నరహరి వివిధ పార్టీ నాయకులు పాల్గొన్నారు
Attachments area