భారీ వర్షంతో పొంగిన వాగులు, వంకలు

రాయికోడ్ అక్టోబర్14 జనం సాక్షి రాయికోడ్ మండల గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో జనజీవనం స్థంభించి పోయాయి. మండలంలోని రాయికోడ్ మండలంలోని ధర్మాపూర్, హుల్గెరా, అల్లపూర్, కుస్నూర్, నాగ్వార్ గ్రామాల వాగులు ప్రధాన రోడ్డు మార్గంలో ఉన్న లోతట్టు వంతెనలపై నుండి వాగులు వంకలు పొంగి పొర్లడంతో సాయంత్రం నాలుగు గంటల నుంచి మూడు గంటల వరకు రాకపోకలు నిలిచి పోయాయి. పొలాలకు వెళ్లిన రైతులు మరియు పాఠశాలలకు వెళ్లిన విద్యార్థులు తిరుగు ప్రయాణంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అంతేకాకుండా వాగు సమీపంలో గల పంట పొలాల్లోకి నీరు రావడంతో పత్తి సోయా పంట నీటమునిగాయి. పంట నీట మునిగిన రైతులు ఆందోళన చెందుతున్నారు. భారీ వర్షాలకు నష్టపోయిన రైతులను ప్రభుత్వం అన్ని విధాల ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.