Tuesday, 3 November 2026

భీమ్లానాయ‌క్ హిందీలోనూ విడుద‌ల

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్, రానా ద‌గ్గుబాటి ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన లేటెస్ట్ చిత్రం ‘భీమ్లానాయ‌క్’. సాగ‌ర్ కే చంద్ర ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రాన్ని సితార ఎంట‌ర్టైన‌మెంట్స్ ప‌తాకంపై సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ నిర్మించాడు. త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ ఈ చిత్రానికి మాట‌లు స్క్రీన్‌ప్లే అందించాడు. గ‌త శుక్ర‌వారం విడుద‌లైన ఈ చిత్రం మొద‌టి షో నుంచే పాజిటీవ్ టాక్‌ను తెచ్చుకుని బాక్సాఫీస్ ద‌గ్గ‌ర క‌లెక్ష‌న్ల సునామీని సృష్టిస్తుంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ చిత్రం 150కోట్ల గ్రాస్ క‌లెక్ష‌న్ల‌ను 88 కోట్ల షేర్‌ను సాధించింది. ఇక ఈ చిత్రం హిందీ విడుద‌ల‌కు సిద్ధ‌మైంది.

మొద‌ట తెలుగుతో పాటు హిందీలోనూ ఈ చిత్రాన్ని ఏక‌కాలంలో విడుద‌ల చేయా శుక్ర‌వారం హిందీ వెర్ష‌న్‌లోల‌ని మేక‌ర్స్ భావించారు. కానీ కొన్ని కారణాల వ‌ల్ల హిందీలో విడుద‌ల కాలేదు.ఇక ఇప్పుడు భీమ్లానాయ‌క్ చిత్రం ఈ విడుద‌ల కానుంది. ఇందులో ప‌వ‌న్ పోలీస్ అధికారిగా క‌నిపించ‌గా రానా ఎక్స్ మిలిట‌రీ ఆఫీస‌ర్‌ పాత్ర‌లో న‌టించాడు. ఈ చిత్రంలో ప‌వ‌న్‌కు జోడిగా నిత్యామీన‌న్ న‌టించ‌గా, రానాకు జోడిగా సంయుక్త మీన‌న్ న‌టించింది. ఎస్ఎస్ థ‌మ‌న్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించాడు.