– పట్టించుకోని పంచాయతీ సర్పంచ్
అశ్వారావుపేట, ఫిబ్రవరి 18( జనంసాక్షి ) పంచాయితీలు అభివృద్ధి కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కోట్ల రూపాయలు వెచ్చించి మంచినీటి సరఫరా, పచ్చదనం పారిశుద్ధ్యం, ఇంకా వివిధ కార్యక్రమాలపై ఖర్చు చేస్తున్నా… ప్రజా ప్రతినిధులు అలసత్వం తో ప్రజలు ఇబ్బందులు పడక తప్పటం లేదు. అశ్వరావుపేట మండలంలోని గిరిజన గ్రామం కోర్స గూడెం లో నెలరోజులుగా మంచి నీళ్లు రాక ఇబ్బందులు పడుతున్నామని అక్కడ ప్రజలు రోడ్డెక్కి మరి నిరసన వ్యక్తం చేశారు. పంచాయితీ సర్పంచ్ కు పలు మార్లు మంచినీటి కోసం విన్నవించుకున్నా ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పొద్దున్నే పని చేసుకొని వచ్చేసరికి వచ్చి మంచి నీటి కోసం పరాయి ఊరు వెళ్ళటం తెచ్చుకోవాటం ఇబ్బందికరంగా ఉందని, మా యందు దయవుంచి సంబంధిత అధికారులు తాగడానికి మంచినీరు అందించాలని అక్కడ ప్రజలు కోరుకుంటున్నారు.
మంచినీటి కోసం రోడ్డెక్కిన గ్రామస్తులు




